Kiran Abbavaram, Dil Ruba team
కిరణ్ అబ్బవరం నటిస్తున్న "దిల్ రూబా" సినిమా ఫిబ్రవరిలో రిలీజ్ చేస్తున్నామని చిత్ర నిర్మాతలు వెల్లడించారు. రుక్సర్ థిల్లాన్ హీరోయిన్ గా నటిస్తోంది. చిత్రాన్ని ప్రముఖ మ్యూజిక్ లేబుల్ సారెగమ తమ నిర్మాణ సంస్థ ఏ యూడ్లీ ఫిలిం సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రవి, జోజో జోస్, రాకేష్ రెడ్డి, సారెగమ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. విశ్వ కరుణ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా టీజర్ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.