రానా దగ్గుబాటి ప్రెజెంట్స్ లో డార్క్ చాక్లెట్ రాబోతుంది

డీవీ

శనివారం, 4 జనవరి 2025 (10:23 IST)
Vishwadev Rachakonda, Bindu Madhavi
35 చిన్న కథ కాదు చిత్రం తర్వాత రానా దగ్గుబాటి, స్పిరిట్ మీడియా  వాల్టెయిర్ ప్రొడక్షన్స్‌తో కలిసి డార్క్ చాక్లెట్‌ను సగర్వంగా అందిస్తున్నారు. విశ్వదేవ్ రాచకొండ, బిందు మాధవి, శశాంక్ శ్రీవాస్తవయ నటిస్తున్న ఈ చిత్రం లుక్ ను విడుదల చేశారు. రానా దగ్గుబాటి, వాల్టెయిర్ ప్రొడక్షన్స్‌తో చేస్తున్న మూడో సినిమా ఇది. సినిమా 2025లో థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు. 
 
డార్క్ చాక్లెట్‌లో విశ్వదేవ్ రాచకొండ,  బిందు మాధవి లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. శశాంక్ శ్రీవాస్తవయ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫస్ట్ లుక్ ఈరోజు విడుదలైంది. ఫస్ట్-లుక్ పోస్టర్‌లో, విశ్వదేవ్ రాచకొండ తన ఫ్యాషన్ ఎటైర్ లో అల్ట్రా-మోడరన్ వైబ్‌ స్టైలిష్ మేకోవర్‌లో ఆకట్టుకున్నారు. రాచకొండ బిందు మాధవి, ఇతర నటీనటులు  నిఘా కెమెరాగా కనిపించే వాటిపై కుట్లు వేస్తూ కనిపించడం ఆసక్తికరంగా వుంది. 'జానర్ ఆడగొడు, మాక్కూడా తెలీదు' అని పోస్టర్ పై రాయడం మరింత క్యురియాసిటీని పెంచింది
ఈ చిత్రానికి  వివేక్ సాగర్ సంగీతం,  అజిత్ అబ్రహం జార్జ్ సౌండ్ మిక్స్‌ చేస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు