యూరోకు వెయ్యి కోట్ల డాలర్లు ఇవ్వనున్న భారత్!

FILE
అప్పుల ఊబిలో కూరుకు పోయిన 17 దేశాల ఐరోపా సమాజాన్ని ఆదుకోవడానికి అంతర్జాతీయ ద్రవ్య నిధి అదనంగా ప్రకటించిన 43వేల కోట్ల డాలర్ల ఆర్థిక ప్యాకేజికి భారత దేశం తన వంతుగా వెయ్యి కోట్ల డాలర్ల సాయాన్ని ప్రకటించింది. జి-20 దేశాల శిఖరాగ్ర సమావేశం ప్లీనరీ సెషన్‌నుద్దేశించిన ప్రసంగించిన సందర్భంగా ప్రధాని మన్మోహన్ సింగ్ ఈ సహాయాన్ని ప్రకటించారు.

అప్పుల ఊబిలో కూరుకుపోయి దివాలా తీసే స్థితిలో ఉన్న ఐరోపా కూటమి దేశాలను ఆదుకోవడానికి ఐఎంఎఫ్ ప్రకటించిన ప్యాకేజికి అన్ని దేశాలు తమ వంతు సహాయాన్ని పెంచాలన్న డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ప్రధాని ఈ ప్రకటన చేయడం గమనార్హం. ఐఎంఎఫ్ ప్రకటించిన 43వేల డాలర్ల ప్యాకేజీకి తన వంతుగా వెయ్యి కోట్ల డాలర్లు సాయంగా ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.

వెబ్దునియా పై చదవండి