సోనియా గాంధీ పర్యటనలో మళ్లీ మార్పులు

FileFILE
కాంగ్రెస్ అధినేత్రి, యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ ఈనెలలో జరుపతలపెట్టిన రాష్ట్ర పర్యటనలో మళ్లీ స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ పర్యటనలో భాగంగా ఈనెల 17వతేదీన ఆమె విజయవాడకు రావాల్సి వుంది. అయితే, ఈ పర్యటన రద్దు అయింది. విజయవాడకు బదులు ఆమె నేరుగా బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. ఢిల్లీ నుంచి ఆమె ప్రత్యేక విమానంలో బేగంపేటకు ఉదయం 10.15 చేరుకుంటారు.

ఎయిర్ పోర్టు ఆవరణలో స్వయం సహాయక గ్రూపులతో 15 నిమిషాల సేపు ఇస్టాగోష్టి కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడ నుంచి హెలికాఫ్టర్‌లో మెదక్ జిల్లా కంది గ్రామానికి చేరుకుంటారు. అక్కడ ఐఐటికి శంకుస్థాపన చేస్తారు. అక్కడి నుంచి తిరిగి బేగంపేట విమానాశ్రయానికి 11 గంటలకు వస్తారు.

ఆ తర్వాత ఖమ్మం జిల్లా కొత్తగూడెంకు వెళ్లి గిరిజన సభలో పాల్గొని, 12.05 నిమిషాలకు హైదరాబాద్‌కు చేరుకుంటారు. 1.45 నిమిషాలకు హైదరాబాద్‌ నెక్లెస్ రోడ్డులో ఏర్పాటు చేసిన ఇందిరాగాంధీ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. 2.15 నిమిషాలకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగే బహిరంగ సభకు హాజరై, 3.30 నిమిషాలకు తిరిగి ఢిల్లీకి బయలుదేరి వెళతారు.

వెబ్దునియా పై చదవండి