రాష్ట్ర మంత్రివర్యుల అనుభవం... విద్యాభ్యాసం వివరాలు!
రాష్ట్ర మంత్రివర్గంలో చోటు సంపాదించుకున్న మంత్రివర్యుల్లో ఎక్కువ సంఖ్యలో రెడ్డి వర్గానికి చెందిన వారే ఉన్నారు. ఆ తర్వాత స్థానంలో కాపులకు పెద్ద పీట వేయగా, దళితులకు మూడో స్థానాన్ని కల్పించారు. చివరి స్థానంలో కాపు వర్గానికి చోటు దక్కింది. అలాగే, రాష్ట్ర శాసనమండలి సభ్యుల్లో మంత్రిపదవిని దక్కించుకున్న వారిలో వైఎస్ఆర్ సోదరుడు వైఎస్.వివేకానంద రెడ్డి మాత్రమే ఉన్నారు. ఇకపోతే.. కొత్త మంత్రివర్గంలో చోటు సంపాదించుకున్న మంత్రివర్యుల విద్యార్హత, వారి రాజకీయ అనుభవం ఇలా ఉంది.
ఆనం రామనారాయణ రెడ్డి (నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఎమ్మెల్యే).. ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఎంపికయ్యారు. రెండుసార్లు మంత్రిగా చేసిన అనుభవం. బీఎల్‌ను పూర్తి చేశారు.
డీకే.అరుణ (మహబూబ్ నగర్ జిల్లా గద్వాల స్థానం).. ఇంటర్మీడియట్ ఉత్తీర్ణురాలైన ఈమె... రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గత వైఎస్సార్ మంత్రివర్గంలో తొలిసారి మంత్రివర్గంలో చోటు దక్కింది.
అహ్మదుల్లా (వైఎస్సార్ జిల్లా కడప).. డిగ్రీలో ఉత్తీర్ణులైన ఈయన.. రాజకీయ అనుభవంతో పాటు.. రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఒక సారి మంత్రి పదవి చేపట్టారు.
పసుపులేటి బాలరాజు (విశాఖపట్నం.. పాడేరు స్థానం).. రాజకీయ అనుభవం ఉన్న ఈయన డిగ్రీ పట్టభద్రుడు. రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎంపికయ్యారు.
బొత్స సత్యనారాయణ (విజయనగరం జిల్లా చీపురుపల్లి సెగ్మెంట్)... బీఏ పూర్తి చేసిన ఈయన.. రెండు సార్లు ఎమ్మెల్యేగాను, ఒకసారి ఎంపీగా ఉన్నారు. వైఎస్ఆర్ మంత్రివర్గంలో మంత్రిగా పని చేశారు.
దామోదర రాజనర్శింహా (మెదక్ జిల్లా ఆంథోల్ స్థానం)... బీఈ పట్టభద్రులైన ఈయన.. మూడుసార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు మంత్రి పదవి చేపట్టారు.
దానం నాగేందర్ (హైదరాబాద్, ఖైరతాబాద్ సెగ్మెంట్)... పీజీ పూర్తి చేసిన ఈయన రాజకీయ అనుభవంతో పాటు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగా ఉన్నారు.
గల్లా అరుణ కుమారి (చిత్తూరు జిల్లా చంద్రగిరి)... బీఎస్సీ పూర్తి చేసిన ఈమె.. నాలుగు సార్లు ఎమ్మెల్యేగాను, రెండుసార్లు మంత్రిగా పనిచేశారు.
జెట్టి గీతారెడ్డి (మెదక్ జిల్లా జహీరాబాద్).. వృత్తిరీత్యా డాక్టరు (ఎంబీబీఎస్) అయినప్పటికీ మూడు సార్లు ఎమ్మెల్యేగా, మూడుసార్లుగా మంత్రిగా చేసిన అనుభవం ఉంది. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఈమె సొంతం.
జూపల్లి కృష్ణారావు (మహబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్ ఎమ్మెల్యే)... బీఏ పట్టభద్రుడైన ఈయన రాజకీయ అనుభవంతో మూడు సార్లు ఎమ్మెల్యేగాను, ఒక దఫా మంత్రిగా పని చేశారు.
కన్నా లక్ష్మీనారాయణ (గుంటూరు జిల్లా వెస్ట్ గుంటూరు)... బీకాం పూర్తి చేసిన ఈయన ఐదు సార్లు ఎమ్మెల్యేగా, మూడు సార్లు మంత్రిగా చేసిన మంచి అనుభవం ఉంది.
కోమటిరెడ్డి వెంకటరెడ్డి (నల్గొండ జిల్లా నల్గొండ స్థానం) బీఈ విద్యాభ్యాసం కలిగిన ఈయన మూడు ఎమ్మెల్యేగా ఎన్నిక కాగా, ఒకసారి మంత్రిగా చేసిన అనుభవం ఉంది.
డొక్కా మాణిక్య వరప్రసాదరావు (గుంటూరు జిల్లా తాడికొండ స్థానం)... ఎల్ఎల్ఎం పూర్తి చేసిన ఈయన రెండు సార్లు ఎమ్మెల్యేగాను, ఒకసారి మంత్రిగా పని చేశారు.
మూల ముఖేష్ గౌడ్ (హైదరాబాద్ జిల్లా గోషామహాల్ స్థానం).. రాజకీయ అనుభవం కలిగిన ఈయన బీఏ పట్టభద్రుడు కాగా, మూడు సార్లు ఎమ్మెల్యేగాను, రెండు సార్లు మంత్రిగా పని చేశారు.
పొన్నాల లక్ష్మయ్య (వరంగల్ జిల్లా జనగామ ఎమ్మెల్యే).. బీఈ, ఎంఎస్ పూర్తి చేసిన ఆయన రాజకీయ అనుభవంతో పాటు.. నాలుగు సార్లు ఎమ్మెల్యేగాను, మూడు సార్లు మంత్రిగా పని చేశారు.
ధర్మాన ప్రసాద రావు (శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం).. విద్యార్హత..ఇంటర్మీడియట్, నాలుగు సార్లు ఎమ్మెల్యేగాను, రెండు సార్లు మంత్రిగా పని చేశారు.
ఎన్.రఘువీరా రెడ్డి (అనంతపురం జిల్లా కల్యాణదుర్గం స్థానం).. బీఎల్ పూర్తి చేసిన ఈయన నాలుగు సార్లు ఎమ్మెల్యేగానూ, ఒకసారి మంత్రిగా చేసిన అనుభవం ఉంది.
రాంరెడ్డి వెంకటరెడ్డి (ఖమ్మ జిల్లా పాలేరు సెగ్మెంట్).. బీఎస్సీ పూర్తి చేసిన వెంకటరెడ్డి గత వైఎస్సార్ మంత్రివర్గంలో మంత్రిగాను, నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు.
సబితా ఇంద్రారెడ్డి (రంగారెడ్డి జిల్లా, మహేశ్వరం స్థానం).. బీఎస్సీ విద్యార్హత కాగా, మూడు సార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు మంత్రిగా ఉన్నారు.
కొలుసు పార్థసారథి (కృష్ణా జిల్లా పెనమలూరు సెగ్మెంట్). బీఈ పూర్తి చేసిన ఈయన రెండు సార్లు ఎమ్మెల్యేగాను, ఒకసారి మంత్రిగా ఉన్నారు.
శత్రుచర్ల విజయరామారావు (శ్రీకాకుళం జిల్లా పాతపట్నం).. విద్యార్హత.. పీయూసీ కాగా, ఐదుసార్లు ఎమ్మెల్యేగా, మూడు సార్లు ఎంపీగా, రెండు సార్లు మంత్రిగా పని చేసిన అనుభవం ఉంది.
దుద్దిళ్ళ శ్రీధర్ బాబు (కరీంనగర్, మంథని స్థానం)... ఎంఏ, ఎల్ఎల్‌బి పూర్తి చేసిన ఈయన మూడు సార్లు శాసనసభ్యునిగా, ఒకసారి మంత్రిగా పని చేశారు.
సుదర్శన్ రెడ్డి (నిజామాబాద్ జిల్లా బోధన్ సెగ్మెంట్)... రాజకీయ అనుభవం కలిగిన ఈయన మూడు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈయన విద్యార్హత బీఏ.
సునీతా లక్ష్మారెడ్డి (మెదక్ జిల్లా నర్సాపూర్ స్థానం).. బీఎస్సీ పూర్తి చేసిన ఈమె.. మూడు సార్లు ఎమ్మెల్యేగాను, ఒకసారి మంత్రిగా పని చేశారు.
వట్టి వసంతకుమార్ (పగో జిల్లా ఉంగుటూరు సెగ్మెంట్).. ఎంబీఏ పూర్తి చేసిన ఈయన రెండు సార్లు ఎమ్మెల్యేగానూ, రెండు సార్లు మంత్రిగా పని చేశారు.
పి.విశ్వరూప్ (తూగో జిల్లా అమలాపురం స్థానం).. డిగ్రీ విద్యార్హత కలిగిన ఈయన రెండుసార్లు ఎమ్మెల్యే. తొలిసారి మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
పితాని సత్యనారాయణ (ప.గో జిల్లా అచంట ఎమ్మెల్యే) బీకాం పూర్తి చేసిన ఈయన రెండు సార్లు ఎమ్మెల్యే. ఒకసారి మంత్రిగా ఉన్నారు.
డీఎల్.రవీంధ్రారెడ్డి (కడప జిల్లా మైదుకూరు స్థానం).. ఎంబీబీఎస్ చేసిన ఈయన.. రాజకీయ అనుభవంతో పాటు ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
కందుకూరు జానారెడ్డి (నల్గొండ, నాగార్జున సాగర్ ఎమ్మెల్యే)... హెచ్ఎస్‌సీ పూర్తి చేసిన ఈయన... ఆరుసార్లు ఎమ్మెల్యేగా, నాలుగు సార్లు మంత్రిగా పని చేసిన అనుభవం వుంది.
కాసు కృష్ణారెడ్డి (గుంటూరు జిల్లా నరసారావుపేట సెగ్మెంట్).. విద్యార్హత బీఎస్సీ కాగా, ఒకసారి మంత్రిగా చేసిన అనుభవం ఉంది.
మానుగుంట మహీధర్ రెడ్డి (ప్రకాశం జిల్లా కందుకూరు సెగ్మెంట్)... ఎల్‌ఎల్‌బి పూర్తి చేసిన ఈయన.. మూడుసార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు.
తోట నర్సింహం (తూ.గో జిల్లా జగ్గంపేట స్థానం).. ఐసీడబ్ల్యూఏఐ పూర్తి చేసిన ఈయన.. రెండుసార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు.
ఏరాసు ప్రతాప్ రెడ్డి (కర్నూలు, శ్రీశైలం స్థానం).. బీఎస్సీ, ఎల్ఎల్‌బీ పూర్తి చేసిన ఈయన రాజకీయ అనుభవంతో పాటు.. మూడు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు.
శైలజానాథ్ (అనంతపురం జిల్లా సింగనమల స్థానం)... ఎంబీబీఎస్ విద్యార్హత కాగా, రాజకీయ అనుభవంతో పాటు రెండుసార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు.
పి.శంకర్రావు (సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే).. ఎంబీబీఎస్ చేసిన ఈయన నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు.
బస్వరాజు సారయ్య (వరంగల్ జిల్లా వెస్ట్ వరంగల్ సెగ్మెంట్).. బీఎల్ పూర్తి చేసిన ఈయన మూడు సార్లు ఎమ్మెల్యేగా పని చేసిన అనుభవం ఉంది.
టీజీ.వెంకటేష్ (కర్నూలు జిల్లా కర్నూలు స్థానం).. విద్యార్హత బీకాం కాగా రాజకీయ అనుభవంతో పాటు మూడు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు.
వైఎస్.వివేకానంద రెడ్డి (వైఎస్ఆర్ జిల్లా)... రాష్ట్రశాసనమండలి సభ్యుల్లో మంత్రి పదవిని దక్కించుకున్న ఏకైక ఎమ్మెల్సీ. ఈయన రెండుసార్లు ఎంపీగాను, రెండు సార్లు ఎమ్మెల్యేగా పని చేసిన అనుభవం ఉంది.