ఒక్కో మండలం నుంచి ముగ్గురిని ఎంపిక చేయండి: చిరు

రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికల హడావుడి వాతావరణం ఉత్పన్నమవుతోంది. ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పటికే మధ్యంతర ఎన్నికలకు సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తాజాగా, చిరంజీవి కూడా ఇదే తరహా సూచనలను పార్టీ నేతలకు చేశారు.

అయితే, చిరంజీవి ఒక అడుగు ముందుకేసి.. ఒక్కో మండలం నుంచి ముగ్గురు నేతలను ఎంపిక చేయాలని గురువారం రాత్రి నేతలకు సూచించారు. ఆర్థిక బలంతో పాటు.. ఎలాంటి అవినీతి ఆరోపణలు, నేర చరిత్ర లేని వారిని గుర్తించి ఒక జాబితాను ఇవ్వాల్సిందిగా పార్టీ నేతలను కోరారు.

ఈ సూచనలను ఆంధ్రా, రాయలసీమ ప్రాంతానికి చెందిన నేతలకు మాత్రమే చేశారు. జస్టీస్ శ్రీకృష్ణ కమిటి నివేదిక తర్వాత తెలంగాణ ప్రాంతంపై ఒక నిర్ణయం తీసుకుందామని ఆయన నేతలతో అన్నారు. అదేసమయంలో మధ్యంతర ఎన్నికలు అనివార్య కారణాల వల్ల ఉత్పన్నమైతే ఎన్నికలను ఎదుర్కొనేందుకు ధీటుగా పార్టీ శ్రేణులను కూడా ఇప్పటి నుంచే సమాయాత్తం చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

వెబ్దునియా పై చదవండి