జగన్‌తో హరిరామ జోగయ్య మంతనాలు: పార్టీలో చేరికా?

ఒకనాటి కాంగ్రెస్ వృద్ధనేత, నర్సాపురం మాజీ ఎంపీ, మొన్నటి ప్రజారాజ్యం పార్టీ మాజీ నేత హరిరామ జోగయ్య కడప ఎంపీ వైఎస్.జగన్మోహన్ రెడ్డితో శుక్రవారం భేటీ అయ్యారు. జగన్‌తో కలిసి నడిచే ఉద్దేశ్యంతోనే ఈ భేటీ వెనుక ఉన్న రహస్యమని ఆయన సన్నిహితులు చెపుతున్నారు.

ఇదే విషయంపై జగన్ వర్గం అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్న అంబటి రాంబాబుతో జోగయ్య నిరంతరం టచ్‌లో ఉంటూ మంతనాలు జరుపుతున్నట్టు వినికిడి. అంతేకాకుండా, హైదరాబాద్‌లో ఉంటున్న జగన్‌ను ఆయన నివాసంలో శుక్రవారం భేటీ అయ్యారు. వీరిద్దరి మధ్య అర్థగంట పాటు చర్చలు జరిగాయి.

ఈ సమావేశం అనంతరం జోగయ్య మీడియాతో మాట్లాతూ కేవలం మర్యాదపూర్వకంగానే భేటీ అయినట్టు చెప్పారు. తమ మధ్య ఎలాంటి రాజకీయాలు లేవన్నారు. అయితే, తన నుంచి కొన్ని సలహాలు, సూచనలు స్వీకరించారని చెప్పారు. అదేసమయంలో జగన్ కొత్త పార్టీ పెట్టడాన్ని తాను స్వాగతిస్తున్నట్టు జోగయ్య ఒక ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.

వెబ్దునియా పై చదవండి