నిజామాబాద్ జిల్లాలో కేకేఆర్.. గుంటూరులో చిరంజీవి టూర్!!

మంగళవారం, 28 డిశెంబరు 2010 (12:05 IST)
రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బుధవారం నిజామాబాద్ జిల్లాలో పర్యటిస్తున్నారు. మరోవైపు ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి గుంటూరు జిల్లాలో పర్యటిస్తూ వర్ష బాధితులను పరామర్శిస్తున్నారు. మరోవైపు తెలుగుదేశం పార్టీ ఈనెల 30వ తేదీన గుంటూరులో నిర్వహించనున్న రైతు కోసం బహిరంగ సభ కోసం భారీగానే ఏర్పాట్లు చేస్తోంది.

ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన నిజామాబాద్ జిల్లాలో తొలిసారి పర్యటిస్తున్నారు. అంతేకాకుండా గత ఏడాదిన్నర కాలంలో జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటించటం కూడా ఇదే ప్రథమం కావడంతో అధికారులు విస్తృతంగా ఏర్పాట్లు చేశారు. ముఖ్యమంత్రికి స్వాగతం పలికేందుకు కాంగ్రెస్ పార్టీ నేతలు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇదిలావుండగా, సీఎంకి త్వరలో కొత్త వాహన శ్రేణిని సమకూర్చనున్నారు. ఈ కొత్త కాన్వాయ్‌లో ఆరు ఫార్చ్యూన్ కార్లు కొలవుదీరనున్నాయి. టయోటా ఫార్చ్యూన్ కార్లు కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల ప్రభుత్వంపై అదనంగా రూ.16 కోట్ల భారం పడనుంది.

వెబ్దునియా పై చదవండి