బాబు బావ ఉద్యమాలకు సంపూర్ణ మద్దతు: బాలయ్య

సోమవారం, 3 జనవరి 2011 (10:35 IST)
ప్రజల కోసం బాబ చంద్రబాబు నాయుడు చేపట్టే ప్రతి ఉద్యమంలో పాల్గొంటానని సినీ నటుడు బాలకృష్ణ ప్రకటించారు. ఆయన సోమవారం శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయంలో దోష నివారణ కోసం ఆయన రాహు, కేతువులకు ప్రత్యేక పూజలు చేస్తున్నారు.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ప్రజల కోసం స్వర్గీయ ఎన్టీఆర్ స్థాపించారన్నారు. అందుకే తమ పార్టీ ఎల్లపుడూ ప్రజల పక్షాన పోరాడుతుందన్నారు. ముఖ్యంగా, దేశానికి అన్నం పెడుతున్న రైతులకు అన్యాయం జరగడాన్ని ఏ ఒక్కరూ సహించజాలరన్నారు.

అందుకే రైతుల పక్షాన తెదేపా తరపున చంద్రబాబు చేపట్టే ఎలాంటి ఉద్యమంలోనైనా పాల్గొనేందుకు తాను సిద్ధంగా ఉన్నట్టు బాలయ్య ప్రకటించారు. రైతు సమస్యల పరిష్కారంపై కాంగ్రెస్ సర్కారు మెతక వైఖరిని అవలంభిస్తోందని ఆయన అన్నారు.

వెబ్దునియా పై చదవండి