సూరిపై మూడు అంగుళాల దూరం నుంచి కాల్పులు: వైద్యులు

మంగళవారం, 4 జనవరి 2011 (11:42 IST)
ప్రముఖ ఫ్యాక్షన్ నాయకుడు మద్దెలచెరువు సూర్యనారాయణ రెడ్డి అలిసాయ్ సూరిని మూడు అంగుళాల దూరం నుంచి తలపై కాల్చినట్టు ఉస్మానియా వైద్యుల శవపంచనామాలో వెల్లడైంది. సోమవారం రాత్రి కారులో వెళుతున్న సూరిని ఇదే కారులో వెనుకసీటులో కూర్చొన్న తన ప్రధాన అనుచరుడు భాను కిరణ్ సైలెన్సర్ తుపాకీతో కాల్పులు జరిపిన విషయం తెల్సిందే. దీంతో సూరి మృత్యువాత పడ్డారు. సూరీ మృతదేహానికి మంగళవారం ఉదయం ఉస్మానియా ఆస్పత్రిలో పంచనామా చేశారు.

ఇందులో సూరి వెనుకభాగం నుంచి కేవలం మూడు అంగుళాల దూరం నుంచి తలపై కాల్పులు జరిపినట్టు తేలింది. తలలో రెండు బుల్లెట్ గాయాలు ఉన్నాయని వైద్యులు చెప్పారు. చిన్న మెదడు బాగా దెబ్బతిందని వారు నిర్ధారించారు. కాల్పులు జరిపిన వెంటనే సూరి ప్రాణాలు విడిచినట్టు పంచనామాలే తేలింది. కాగా, శవ పంచనామా అనంతరం సూరి మృతదేహాన్ని ఆయన స్వస్థలం అనంతపురం జిల్లా మద్దెలచెరువుకు తరలించారు.

వెబ్దునియా పై చదవండి