ఫ్యాక్షన్ రాజకీయాలకు ఆమడ దూరం: మంత్రి రఘువీరా

మంగళవారం, 4 జనవరి 2011 (13:07 IST)
తాను ఫ్యాక్షన్ రాజకీయాలకు ఆమడ దూరంగా ఉంటానని రాష్ట్ర రెవెన్యూ శాఖామంత్రి ఎన్.రఘువీరా రెడ్డి అభిప్రాయపడ్డారు. సోమవారం రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో కాల్చివేతకు గురైన అనంతపురం జిల్లాకు చెందిన ఫ్యాక్షనిస్టు మద్దెలచెరువు సూరి మృతదేహానికి ఆయన నివాళులు అర్పించారు. ఇందుకోసం ఆయన మంగళవారం ఉదయం ఉస్మానియా ఆస్పత్రికి వచ్చారు.

నివాళులు అర్పించిన తర్వాత మంత్రి రఘువీరా మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఫ్యాక్షన్ హత్యలకు అంతం పలకాలని ఆయన పిలుపునిచ్చారు. ఫ్యాక్షన్ రాజకీయాలకు తాను వ్యతిరేకమన్నారు. భవిష్యత్‌లో ఇలాంటి హత్యలు జరుగకుండా కట్టుదిట్టమైన చర్యలుతీసుకోవాలని కోరారు. ప్రస్తుత సమయంలో తమ జిల్లా వాసులు సంయమనం పాటించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.

వెబ్దునియా పై చదవండి