రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని మార్చే ప్రసక్తే లేదని కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీ స్పష్టం చేశారు. రాష్ట్ర రాజకీయాలపై తమకు పూర్తి అవగాహన ఉందని మొయిలీ వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలపై ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మొయిలీ తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి పనితీరు భేష్ అని మొయిలీ కితాబిచ్చారు.
శాసనసభ బడ్జెట్ సమావేశాల లోగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని తప్పించి, తెలంగాణ నేతల్లో ఒకరికి ముఖ్యమంత్రి పదవి అప్పగించే దిశగా కాంగ్రెస్ సన్నాహాలు చేస్తున్నట్లు మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్‌కు చెందిన సాక్షి టీవీ చానెల్ ప్రసారం చేసిన వార్తాకథనంపై మొయిలీ తీవ్రంగా మండిపడ్డారు.