20న ఢిల్లీకి రండి: రాష్ట్ర ఎంపీలకు కాంగ్రెస్ అధిష్టానం పిలుపు

మంగళవారం, 18 జనవరి 2011 (11:46 IST)
జనవరి 20న ఢిల్లీకి రావాల్సిందిగా రాష్ట్ర ఎంపీలకు అధిష్టానం కబురు పంపింది. కేంద్రమంత్రివర్గ విస్తరణ చేపట్టనున్నారన్న తరుణంలో ఎంపీలకు పిలుపు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇదిలావుంటే కేంద్రమంత్రి పదవులకోసం సీమాంధ్ర ప్రాంత ఎంపీలకంటే తెలంగాణా ప్రాంత కాంగ్రెస్ ఎంపీలు గంపెడాశతో ఉన్నట్లు తెలుస్తోంది. మీడియా ముందుకొచ్చి మరీ అధిష్టానం పదవులిస్తే వదులుకోబోమని ఆ ప్రాంత కాంగ్రెస్ ఎంపీలు చెపుతున్నారు.

రాష్ట్రం నుంచి 33 మంది ఎంపీలు కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తుంటే కాంగ్రెస్ అధిష్టానం మాత్రం తగిన ప్రాధాన్యత కల్పించలేదనీ, ఆంధ్రప్రదేశ్‌కు తీరని అన్యాయం చేస్తోందని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విమర్శిస్తున్న దరిమిలా ఈసారి విస్తరణలో సాధ్యమైనంత ఎక్కువమందిని మంత్రివర్గంలోకి తీసుకోనున్నట్లు సమాచారం.

వెబ్దునియా పై చదవండి