విశాఖ జిల్లాలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర మళ్లీ ప్రారంభమైంది. విశాఖ నగర పరిధిలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు సహా ఎనిమిది నియోజకవర్గాల్లో 322 కిలోమీటర్లకు పైగా యాత్ర నిర్వహించనున్నారు. ఈ యాత్రలో జగన్ ఆరు కుటుంబాలను ఓదారుస్తారు.
యాత్రలో భాగంగా ఆయన జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో 50కు పైగా వైఎస్ విగ్రహాలను ఆవిష్కరించనున్నారు. వాస్తవానికి ఈ జిల్లాలో ఓదార్పు జనవరి 3 నుంచి జరగాల్సి ఉంది. ఐతే కృష్ణా జలాలపై ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు వల్ల రాష్ట్రానికి జరగనున్న అన్యాయాన్ని చాటిచెప్పేందుకు జగన్ తన యాత్రను మధ్యలోనే ఆపివేసి ఢిల్లీలో జలదీక్ష చేశారు. దీంతో ఆయన ఈ జిల్లాలో కేవలం ఆరు రోజుల పాటు మాత్రమే ఓదార్పు యాత్ర నిర్వహించారు.