నేడు హస్తినకు వెళ్లనున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్!

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గురువారం ఢిల్లీకి వెళ్లనున్నారు. రాష్ట్ర విభజనపై పార్లమెంటు సభ్యుల అభిప్రాయాలను అధిష్టానం తెలుసుకుంటున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌ రెడ్డి, సీమాంధ్ర మంత్రులు ఢిల్లీ బాట పడుతున్నారు.

ఇందుకోసం కిరణ్‌కుమార్‌రెడ్డి గురువారం సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు. గురువారం సాయంత్రం వీలుపడక పోతే శుక్రవారం ఉదయం ఢిల్లీకి వెళతారని సీఎం కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. ఈ పర్యటనలో రైల్వే పథకాలపై కేంద్రమంత్రి మమతా బెనర్జీతో సీఎం సమావేశమవుతారు.

జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ నివేదికపై ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకోవడానికి ముందు రాష్ట్రానికి చెందిన పార్లమెంటు సభ్యుల, ముఖ్యమంత్రి అభిప్రాయాలను తెలుసుకోవాలని అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ముఖ్యమంత్రిని ఢిల్లీకి పిలిచినట్లు చెబుతున్నారు.

వెబ్దునియా పై చదవండి