వైఎస్సార్ చేపట్టిన రచ్చబండ కార్యక్రమాన్ని అడ్డుకోవద్దు!

ప్రజల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనున్న రచ్చబండ కార్యక్రమాన్ని అడ్డుకుంటామన్న తెలంగాణవాదులను మల్లు భట్టి విక్రామార్క తప్పు బట్టారు. ప్రజా సంక్షేమ పథకాల్లో ఉన్న లోటుపాట్లను సరిదిద్దే రచ్చబండ కార్యక్రమాన్ని అడ్డుకోవద్దని విక్రమార్క కోరారు. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి చేపట్టిన రచ్చబండ కార్యక్రమం ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేయబడిందని విక్రమార్క వ్యాఖ్యానించారు.

ప్రజా సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోవడానికే రచ్చబండ కార్యక్రమమని తెలిపారు. ఈనెల 24నుండి ఫిబ్రవరి 12వరకు రాష్ట్రవ్యాప్తంగా రచ్చబండ కార్యక్రమం ఉంటుందన్నారు. రచ్చబండ కార్యక్రమంలో రేషన్ కార్డులు తదితర ప్రజా సంక్షేమ కార్యక్రమాలపై రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి దృష్టి పెడతారని విక్రమార్క తెలియజేశారు.

వెబ్దునియా పై చదవండి