రచయిత వెంకట త్రిపురాంతకేశ్వర రావు ఇకలేరు!

శనివారం, 25 మే 2013 (09:26 IST)
File
FILE
తెలుగు అక్షర శిఖరం, ప్రముఖ రచయిత త్రిపుర (రాయసం వెంకట త్రిపురాంతకేశ్వరరావు) తిరిగిరాని లోకాలకు చేరుకున్నారు. ఆయనకు వయస్సు 85 యేళ్లు. తెలుగు భాషలో విశేష రచనలు చేసిన త్రిపుర గత కొంతకాలంగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతూ వచ్చారు.

ఆయను విశాఖలోని ఒక కార్పొరేట్ ఆస్పత్రిలో చేర్చగా అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశారు. దీంతో సాహితీ ప్రియులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.

ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లా పురుషోత్తపురంలో 1928 సంవత్సరంలో జన్మించిన త్రిపుర.. హైస్కూల్, కళాశాల విద్య విశాఖలోని ఎవిఎన్ కళాశాల్లో పూర్తి చేశారు. బెనారస్ యూనివర్శిటీలో అగ్రికల్చర్ బిఎస్సీ పూర్తి చేసిన ఆయన.. 1953లో ఎంఎ ఇంగ్లీష్‌లో విశ్వవిద్యాలయంలో టాపర్‌గా నిలిచారు.

1960 వరకూ ఆయన వారణాసి, మాండలే (బర్మా), జోజ్‌పూర్, విశాఖపట్నంలో ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగారు. 1960లో త్రిపురలో మహరాజా వీర్ విక్రమ్ కాలేజీలో ఇంగ్లీష్ లెక్చరర్‌గా చేరి 1987లో ఆయన పదవీ విరమణ చేశారు.

ఆయన చాలా కాలం త్రిపురలోనే నివాసం ఉండటంతో ఆయన కలం పేరును త్రిపురగా మార్చుకున్నారు. 1963-73 మధ్య కొన్ని రచనలు చేసిన త్రిపుర ఆ తర్వాత ఏడేళ్ళపాటు సాహితీ ప్రపంచానికి దూరంగా ఉన్నారు. త్రిపుర తన సాహితీ జీవితంలో కేవలం 15 కథలు మాత్రమే రాసినప్పటికీ.. 'సెగ్మెంట్' అనే పేరుతో ఆయన రాసిన కథ విశేష ప్రాచూర్యం పొందింది.

వెబ్దునియా పై చదవండి