హెచ్‌పీసీఎల్ ప్రమాదానికి వెల్డింగ్ నిప్పు రవ్వలే కారణమా?

శనివారం, 24 ఆగస్టు 2013 (15:54 IST)
File
FILE
విశాఖపట్టణంలోని హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ సంస్థ (హెచ్.పి.సి.ఎల్)లో శుక్రవారం చోటు పెను అగ్ని ప్రమాదానికి వెల్డింగ్ చేసే సమయంలో వెలువడే నిప్పురవ్వలే ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఈ ప్రమాదానికి ముందు వెల్డింగ్ పనులు జరుగుతుండగా, ఆ నిప్పు రవ్వలు రసాయన పదార్థాలపై పడటంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు సమాచారం. దీనిపై మరింత లోతుగా పరిశీలిస్తే..

హెచ్‌పీసీల్ సంస్థ ఆవరణలో కొన్నేళ్లుగా కూలింగ్ టవర్ నిర్మాణ పనులను గోపాల్, జయలక్ష్మి ఇంజనీరింగ్, డ్రిజ్ అండ్ గూప్ సంస్థలు చేస్తున్నాయి. ఈ పనుల్లో 200 మంది కార్మికులకుపైగా విధులు నిర్వహిస్తున్నారు. శుక్రవారం కూలింగ్ టవర్ పైభాగంలో వెల్డింగ్ పనులు నిర్వహిస్తుండగా నిప్పు రవ్వలు జారి కింద ఉన్న రసాయన వ్యర్థాలపై పడడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి.

టవర్ చుట్టూ పనికి రాని చెక్కలు, స్టేజింగ్ కోసం ఏర్పాటు చేసిన కర్రలు, ఇతర వ్యర్థాలు ఉండటంతో మంటలు 50 మీటర్లు ఎత్తుకు వ్యాపించాయి. ప్రమాదం చోటుచేసుకున్నప్పుడు ఆ ప్రాంగణమంతా దట్టమైన పొగలు, మంటలు అలముకోవడంతో గాయపడిన వారిని రక్షించేందుకు ఎవరూ సాహసించలేదు. అరగంట వరకు ఆ ప్రదేశానికి ఎవరూ వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఫలితంగా పెను ప్రమాదం చోటు చేసుకున్నట్టు ప్రత్యక్ష సాక్షుల కథనంగా ఉంది.

వెబ్దునియా పై చదవండి