సీమాంధ్ర ప్రజల కోసం కేంద్ర కమిటీ : ప్రధాన మంత్రి

FILE
తెలంగాణపై కమిటీలు పోయి, ఇప్పుడు సీమాంధ్ర ప్రజల కోసం కొత్త కమిటీల నియామకం ప్రారంభమవుతోంది. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పేరిట రాష్ట్రంతో ఆడుకుంటోంది. తాగా వైకాపా గౌరవాధ్యక్షురాలు విజయమ్మ నాయకత్వంలో ఆ పార్టీ బృందం ప్రధాని మన్మోహన్ సింగ్‌ను మంగళవారం కలిసింది.

సమన్యాయం చేయలేకపోతే రాష్ట్రాన్ని విడదీయవద్దని ఈ బృందం కోరింది. దానికి ప్రధాని మన్మోహన్ సింగ్ సమాధానం ఇస్తూ సీమాంధ్ర ప్రజలు లేవనెత్తిన సమస్యలపై పరిశీలనకు కేంద్రం ఒక కమిటీ వేస్తుందని చెప్పారని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పారు.

హైదరాబాద్, నదీజలాలు తదితర అంశాలను ప్రస్తావించారు. ఏభైఏడు ఏళ్లుగా కలిసి ఉన్న రాష్ట్రాన్ని విడదీస్తారా అని ప్రశ్నించారు. మేకపాటి రాజమోహన్ రెడ్డి, మైసూరారెడ్డి, కొడాలి నాని తదితరులు ఈ బృందంలో ఉన్నారు.

వెబ్దునియా పై చదవండి