ప్రేమ గుడ్డిదని, ప్రేమ.. కులం, మతం, జాతి, లింగ బేధాలకు అతీతమని ప్రేమలో "మునిగి"న ప్రేమికులు చెప్పడం చూశాం. ప్రేమ గుడ్డిదో కాదో తెలియదు కానీ.. ఈ సంఘటన గురించి తెలుసుకుంటే మాత్రం ఖచ్చితంగా గుడ్డిదని విశ్విసించక తప్పేలా లేదు.
అస్ట్రేలియాకు చెందిన ఓ యువకుడు తన స్నేహితురాలు "హనీ"ని వివాహం చేసుకున్నాడు. ఆ.. ఇందులో వింతేముంది అంటారా..? వింతే మరి ఎందుకంటే.. హనీ అంటే అతను పెంచుకునే పెంపుడు "కుక్క" (భౌ.. భౌ..).
జోసెఫ్ గైసో అనే ఆస్ట్రేలియన్ యువకుడు లాబ్రాడర్ జాతికి చెందిన తన పెంపుడు శునకం హనీని వివాహం చేసుకున్నాడని, త్వరలోనే ఆ జంట హనూమూన్‌కి కూడా వెళ్లడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు స్థానిక మీడియా పేర్కొంది.
గైసో ఐదేళ్ల నుంచి హానీని పెంచుకుంటున్నాడు. గత గురువారం క్వీన్స్‌ల్యాండ్‌లోని తూవూమ్బా నగరంలో గైసో, హనీలకు వివాహం జరిగినట్లు హెరాల్డ్ సన్ పేర్కొంది. ఈ కార్యక్రమానికి 30 మంది సన్నిహితులు, దగ్గర బందువులు కూడా హాజరయ్యారట.
"నువ్వు నా మంచి స్నేహితురాలివి, నీ వల్ల నా ప్రతిరోజు సంతోషంగా గడిచిపోతుంద"ని గైసో చెప్పాడు. పైగా.. ఓ సాంప్రదాయమైన వ్యక్తి పెళ్లిసంబంధం ద్వారా హనీతో కలిసి జీవిచండంలో ఎలాంటి అపరాధం లేదని గైసో సెలవిచ్చాడు.
అయితే.. ఈ సంబంధం లైంగిక పరమైనది కాదని ప్రేక్షక జనాని (లోకాని)కి గైసో చెప్పడంతో పలువురు ఊపిరి పీల్చుకున్నారు. ఇది కేవలం స్వచ్ఛమైన ప్రేమ మాత్రమేనని ఆయన ప్రేమోపదేశం చేశారు. ఓరి నీ శునక ప్రేమ బంగారం కానూ...!!