ఆఫ్ఘనిస్థాన్‌కు తిరిగి రానున్న రాకుమారుడు హ్యారీ: నివేదిక
ఆదివారం, 2 జనవరి 2011 (14:11 IST)
బ్రిటన్ రాకుమారుడు హ్యారీ మరోసారి ఆఫ్ఘనిస్థాన్‌కు తిరిగిరానున్నారు. ఉగ్రవాదంపై ఆఫ్ఘనిస్థాన్‌లో జరుగుతున్న పోరులో బ్రిటన్ బలగాలు కూడా పనిచేస్తున్నాయి. ఆఫ్ఘన్‌లో యుద్ధం ముగిసే నాటికి బ్రిటన్ బలగాలు పూర్తిగా ఆఫ్ఘనిస్థాన్‌ను వీడి వెళ్లిపోయేలోపు హ్యారీ ఆ దేశంలో పర్యటించి సేవలు చేయనున్నట్లు ఓ మీడియా నివేదిక వెల్లడించింది.
హెలికాఫ్టర్ శిక్షణా కేంద్రంలోని కొందరు ఈ విషయాన్ని వెల్లడించినట్లు సండే ఎక్స్‌ప్రెస్ పేర్కొంది. గత మార్చిలో హ్యారీ శిక్షణను స్కాట్లాండ్‌కు మార్చారు. ఆర్మీ ఎయిర్ కార్ప్స్‌కు చెందిన ఉన్నత వర్గాల సమాచారం ప్రకారం.. గత ఏడాది ఏప్రిల్‌లోనే హ్యారీ శిక్షణను పూర్తి చేశారు. ఆరు నుంచి ఎనిమిది నెలల పాటు ప్రత్యేక శిక్షణను ఎదుర్కోవలసి ఉంది. మరో ఏడాది పాటు హ్యారీ బ్రిటన్‌లో గడపనున్నారని ఆ వర్గాలు తెలిపాయి. 2012 క్రిస్టమస్‌కు ముందు హ్యారీని ఆఫ్ఘనిస్థాన్‌లో నియమించే అవకాశమున్నట్లు సమాచారం.