మన్మోహన్‌కు యుఎస్ కోర్టు సమన్లు : జూన్ 18 డెడ్‌లైన్!

శుక్రవారం, 25 ఏప్రియల్ 2014 (12:46 IST)
File
FILE
భారత ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌కు జూన్ 18వ తేదీలోగా సమన్లు అందివ్వాలని అమెరికా కోర్టు అక్కడి సిక్కుల మత సంస్థ సిక్ ఫర్ జస్టిస్‌కు గడువు విధించింది. లేకుంటే ఆయనపై దాఖలైన మానవ హక్కుల ఉల్లంఘన కేసును కొట్టివేయాల్సి ఉంటుందని తేల్చి చెప్పింది. సమన్లు అందించినట్లు సాక్ష్యాన్ని జూన్ 18లోగా సమర్పించాలని వాషింగ్టన్ ఫెడరల్ కోర్టు జడ్జి ఆదేశించారు.

మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో సిక్కులపై దాడులకు సహకారం అందించారని ఆరోపిస్తూ సిక్ ఫర్ జస్టిస్ సంస్థ కోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. దీంతో వాషింగ్టన్ ఫెడరల్ కోర్టు గతేడాది సెప్టెంబర్ నెలలోనే మన్మోహన్ సింగ్‌కు సమన్లు జారీ చేసింది. వాటిని అందించడానికి తాజాగా గడువు విధించింది.

వెబ్దునియా పై చదవండి