అణు మినహాయింపు మూలమలుపు: భారత్

శనివారం, 6 సెప్టెంబరు 2008 (20:26 IST)
అంతర్జాతీయ అణు వాణిజ్యం కోసం భారత్‌కు మినహాయింపు ఇస్తూ అణు ఇంధన దేశాలు తీసుకున్న మూకుమ్మడి నిర్ణయం ఒక మూలమలుపుగా భారత్ అభివర్ణించింది. ఎన్ఎస్‌జి దేశాల నిర్ణయం అణు నిరాయుధీకరణ విషయంలో భారత్ చేపట్టిన విశ్వసనీయ వైఖరికి గుర్తింపు అని భారత్ ప్రధాని మన్మోహన్ వ్యాఖ్యానించారు.

అణు ఇంధన సరఫరా వాణిజ్యం కోసం భారత్‌కు ఆమోదం తెలుపుతూ 45 దేశాల అణు సరఫరా బృందం చేసిన ఏకాభిప్రాయ ప్రకటన ముందు చూపుతో తీసుకున్న మేటి నిర్ణయంగా ప్రధాని అభివర్ణించారు.

ఎన్ఎస్‌జి తన ఆమోదం తెలిపిన వెంటనే తాను అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్‌తో మాట్లాడానని, పౌర అణు ఒప్పందాన్ని ముందుకు తీసుకుపోవడానికి, మరియు భారత్, అంతర్జాతీయ సమాజంతో పూర్తి స్థాయి పౌర అణు సహకారాన్ని ప్రారంభించేందుకోసం, ఆయన చేపట్టిన పాత్రకు ధన్యవాదాలు తెలిపానని ప్రధాని చెప్పారు.

వెబ్దునియా పై చదవండి