తీవ్రవాదంపై యూపీఏ మెతకవైఖరి: రాజ్‌నాథ్

FileFILE
దేశంలో పెట్రేగిపోతున్న ఉగ్రవాద చర్యలకు అడ్డుకట్ట వేసేందుకు కఠిన చట్టాలను రూపొందించాలని భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఉగ్రవాదంపై పోరాడటానికి ప్రస్తుతం ఉన్న చట్టాలు సరిపోవన్నారు. ముఖ్యంగా తీవ్రవాద చర్యలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం వెనుకంజ వేయడం దురదృష్టకరమని ఆయన విచారం వ్యక్తం చేశారు.

లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని పంజాబ్ రాష్ట్రం నుంచి భాజపా ప్రారంభించింది. ఈ సందర్భంగా రాజ్‌నాథ్ సింగ్ ప్రసంగిస్తూ యూపీఏ ప్రభుత్వ వైఖరిపై విమర్శల వర్షం గుప్పించారు. ఓటు బ్యాంకు రాజకీయాలకు యూపీఏ సర్కారు ప్రాధాన్యత ఇస్తూ తీవ్రవాదంపై మెతకవైఖరి అవలంభిస్తోందని ఆయన ఆరోపించారు.

పాలనా సంస్కరణల కమిషన్ ఛైర్మన్‌ వీరప్ప మొయిలీ కూడా తీవ్రవాదం అణచివేతకు కఠినతరమైన చట్టాలు అవసరమని సిఫార్సు చేసిన విషయాన్ని రాజ్‌నాథ్ గుర్తు చేశారు. అయినప్పటికీ.. యూపీఏ ప్రభుత్వం పెడచెవిన పెట్టిందన్నారు.

కీలక అంశాలపై యూపీఏ ప్రభుత్వం తీవ్రంగా స్పందించడం లేదని రాజ్‌నాథ్ గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల అనంతరం ఎన్డీయే అధికారంలోకి వస్తే తీవ్రవాదంపై ఉక్కుపాదం మోపడమే తమ ప్రధాన కర్తవ్యమన్నారు.

వెబ్దునియా పై చదవండి