తమిళనాడులో భారీ వర్షాలు: 30 మంది మృతి

'నిషా' తుఫాను ప్రభావం కారణంగా పొరుగు రాష్ట్రమైన తమిళనాడులో కురుస్తున్న భారీ వర్షాలకు ఇప్పటి వరకు 30 మంది మృత్యువాత పడ్డారు. లక్షలాది మంది తమ ఆవాసాలను కోల్పోయి నిరాశ్రయులయ్యారు. కాగా, భారీ వర్షాలకు రాష్ట్రం అతలాకుతలమైంది. జన జీవనం అస్తవ్యస్తమైంది. పలు లోతట్టు ప్రాంతాలన్నీ నీటమునిగాయి. తుఫాను బీభత్సంతో రాష్ట్రంలోని 12 జిల్లాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించారు.

తుఫాను ప్రభావం కారణంగా తమిళనాడుతో పాటు కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా వర్షాలు పడుతున్నాయి. ఇదిలావుండగా తుఫాను తమిళనాడులోని వేదారణ్యం వద్ద తీరందాటినట్టు సమాచారం. ఇదిలావుండగా నిషా తఫాను ప్రభావం వల్ల తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో కూడా భారీవర్షం పడుతోంది. మంగళవారం రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తున్న విషయం తెల్సిందే.

వెబ్దునియా పై చదవండి