యూపీఏకు షరతులు లేని మద్దతు: ఒమర్

FileFILE
కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వానికి నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ షరతులు లేని మద్దతును ప్రకటిస్తున్నట్టు జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తెలిపారు. కేంద్ర మంత్రి వర్గంలో తాము ఎలాంటి మంత్రిత్వ శాఖను కోరబోమని ఆయన స్పష్టం చేశారు. ఈ పార్టీ నాలుగు ఎంపీ సీట్లను గెలుచుకున్న విషయం తెల్సిందే.

దీనిపై ఆయన మాట్లాడుతూ యూపీఏకు మేం ఇచ్చే మద్దతు షరతులు లేనిది. మేం దేనికోసం బేరసారాలు జరుపబోం. అలాగే, మంత్రివర్గంలో స్థానాన్ని ఆశించమని ఆయన చెప్పారు. ఎంపీగా గెలిచిన స్వతంత్ర అభ్యర్థి ఒకరు సోమవారం ఎన్.సి తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సోమావేశంలో ఒమర్ పై విధంగా వ్యాఖ్యానించారు.

కేంద్రం ముందు మోకారిల్లబోం. తాము శ్రీనగర్‌లోనే ఉంటాం. భిక్షపాత్రతో న్యూఢిల్లీకి వెళ్లబోమన్నారు. స్వతంత్ర అభ్యర్థి చేరికతో ఎన్సీ ఎంపీల బలం నాలుగుకు చేరింది. అందువల్ల ఎన్సీకి కేంద్ర మంత్రి వర్గంలో చోటు దక్కుతుందా అని విలేకరులు ప్రశ్నించగా యూపీఏ విజయంలో తాము పాత్ర పోషించాం. యూపీఏ తరపున దేశ వ్యాప్తంగా జరిగిన ఎన్నికల ర్యాలీల్లో తాను పాల్గొన్నాను.

వెబ్దునియా పై చదవండి