2జి స్పెక్ట్రమ్‌పై సుప్రీం మొట్టికాయలు పిదప డెడ్‌లైన్

2జి స్పెక్ట్రమ్ కుంభకోణం యూపీఎ ప్రభుత్వం అనుసరిస్తున్న జాప్యంపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. ప్రధాని మౌనంపై రెండు రోజుల క్రితం ప్రశ్నంచిన సుప్రీంకోర్టు గురువారం కేంద్రానికి మరో షాక్ ఇచ్చింది. శనివారంలోగా 2జి స్పెక్ట్రమ్‌పై కోర్టులో అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

ఇదిలావుండగా సుప్రీంకోర్టు అడిగిన ప్రశ్నకు గురువారం ప్రధానమంత్రి జవాబు ఇస్తారని అంటున్నారు. అయితే ఈ జవాబు చెప్పే లోపే మరోసారి సుప్రీంకోర్టు యూపీఎకు షాక్ ఇచ్చింది.

మరోవైపు 2జి స్పెక్ట్రమ్ కుంభకోణంపై గురువారం కూడా పార్లమెంటు దద్దరిల్లింది. అటు రాజ్యసభ కూడా అట్టుడుకి పోయింది. దీంతో లోక్‌సభను మధ్యాహ్నం 12 గంటల వరకూ వాయిదా వేశారు. రాజ్యసభను రేపటికి వాయిదా వేశారు.

వెబ్దునియా పై చదవండి