నాగవంశీ నిర్మాణంలో నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో వస్తున్న తాజా చిత్రం 'డాకు మహారాజ్' సంక్రాంతికి విడుదల కానుంది. జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ఇప్పటికే వరుస ప్రమోషన్స్ నిర్వహిస్తోంది. అయితే ఈ సినిమాలోని 'దబిడి దిబిడి' పాటపై నెట్టింట ట్రోల్స్ వస్తున్న విషయం తెలిసిందే. మరో పక్క నందమూరి కుటుంబంలో నెలకొన్న గొడవల కారణంగా బాలకృష్ణ, తారక్ దూరంగా ఉంటూ వస్తున్నారు.
తారక్ దేవర సినిమా విడుదల సమయంలో బాలకృష్ణ ఏ విధంగా స్పందించకపోవడంతో వారి ఇరువురి ఫ్యాన్స్ మద్య వివాదం మరింత పెరిగింది. దీంతో బాలకృష్ణ 'డాకు మహారాజ్'ను తారక్ అభిమానులు టార్గెట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే డాకు మహారాజ్‌పై నెటిజన్లు నెగిటివ్ ట్రెండ్ చేస్తున్నారు. ఈ వివాదం ముదురుతున్న నేపథ్యంలో నిర్మాత నాగవంశీ డాకు మహారాజ్ మువీకి సంబంధించి పోస్టు చేయడం ఆసక్తికరంగా మారింది.