ప్రత్యక్ష ఎన్నికల్లో గెలుపోటములు సహజమే: రాహుల్

రాజకీయ ప్రత్యక్ష ఎన్నికల్లో గెలుపోటములు సహజమేనని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు. అందువల్ల బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తనను నిరుత్సాహానికి గురి చేయలేదని పార్లమెంట్ వెలుపల మీడియా అడిగిన ప్రశ్నలకు రాహుల్ సమాధానం ఇచ్చారు.

ప్రస్తుత పరిస్థితుల్లో బీహార్ రాష్ట్రంలో పార్టీని పునర్మించాల్సిన ఆవశ్యకతను బీహార్ ఫలితాలు తమకు గుర్తు చేశాయన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్థానాల సంఖ్య తొమ్మిది నుంచి నాలుగింటికి పడిపోయింది. దీంతో బీహార్‌లో రాహుల్ మంత్రం పని చేయలేదని విపక్ష పార్టీల నేతలే కాకుండా, స్వపక్ష నేతలు కూడా అభిప్రాయపడుతున్నారు.

ముఖ్యంగా, బీహార్ ఎన్నికల్లో రాహుల్ ప్రచారం చేసిన 22 స్థానాల్లో ఒక్క సీటును కూడా కాంగ్రెస్ విజయసాధించలేక పోవడం గమనార్హం. అదేసమయంలో పార్టీ అధినేత్రి, రాహుల్ తల్లి సోనియా గాంధీ ప్రచారం చేసిన చోట రెండు స్థానాల్లో విజయం సాధించింది. మరో రెండు చోట్ల అభ్యర్థులు స్థానిక బలంతో గెలుపొందారు.

వెబ్దునియా పై చదవండి