వచ్చే రెండేళ్ళలో కొత్త రాజకీయ పార్టీ: రామ్‌దేవ్ బాబా
యోగా గురువు రామ్‌దేవ్ బాబా మరోసారి తన రాజకీయ పార్టీ ప్రస్తావన తెచ్చారు. రానున్న రెండేళ్లలో కొత్త రాజకీయ పార్టీని స్థాపిస్థానని ఆయన చెప్పారు. రాజకీయ పార్టీ ఏర్పాటు చేయాలనే తమ నిర్ణయంలో ఎలాంటి మార్పూలేదని ఆయన స్పష్టం చేశారు.
తమ కొత్త రాజకీయ పార్టీ తరఫున ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరనేది రెండేళ్ళ తరవాతే ప్రకటిస్తానని, అయితే తనకు మాత్రం ప్రధానమంత్రి కావాలనే ఆలోచన ఏమాత్రం లేదని బాబా చెప్పారు. ఇటీవల జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన నితీష్ కుమార్‌ను ఆయన అభినందించారు.
బీహార్ ప్రజలు అభివృద్ధికే పట్టం కట్టారని, అందుకే ఎన్‌డిఏ అనూహ్యంగా రెండో సారి అధికారంలోకి వచ్చిందని రామ్‌దేవ్ బాబా అన్నారు. రాష్ట్రంలో అవినీతిని తరిమికొట్టడానికి నితీష్ కృషి బాబా విజ్ఞప్తి చేశారు. ప్రజా సమస్యల పరిష్కారంపై ముఖ్యమంత్రి దృష్టిపెడతారనే విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు.