హార్డ్‌వేర్ లోపం వల్లే జీఎస్ఎల్వీ ఎఫ్-06 ప్రయోగం విఫలం

మంగళవారం, 28 డిశెంబరు 2010 (15:50 IST)
గత శనివారం నెల్లూరు జిల్లా, శ్రీహరికోటలోని షార్ కేంద్రం నుంచి ప్రయోగించిన కమ్యూనికేషన్ శాటిలైట్ కలిగిన రాకెట్ జీఎస్ఎల్వీ ఎఫ్-06 ప్రయోగం విఫలం కావడానికి హార్డ్‌వేర్‌ లోపమే కారణమని ప్రాథమిక విశ్లేషణలో తేలినట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) అధికారి ఒకరు వెల్లడించారు.

రాకెట్‌ను ప్రయోగించిన కొద్దిసేపటికే హార్డ్‌వేర్‌కు సంబంధించిన సమస్య తలెత్తడంతో రాకెట్‌లోని నాలుగు కనెక్టర్లు పనిచేయక మొదటి దశలోనే విఫలమైపోయిందని నిపుణులు అంచనా వేసినట్లు ఆ అధికారి పేర్కొన్నారు. దీనికి తోడు రాకెట్ లింక్‌ కూడా విఫలం కావడంతో 418 టన్నుల బరువున్న రాకెట్‌ అదుపు తప్పి దిశ మారిందని ఆయన తెలిపారు.

దీంతో రాకెట్‌ నియంత్రణ కేంద్రం తప్పనిసరి పరిస్థితిలో, రాకెట్‌ శకలాలు భూమిపై కాకుండా, సముద్రంలో పడే విధంగా పేల్చి వేయాల్సి (డిస్ట్రక్ట్‌ కమాండ్‌) వచ్చిందని ఆయన వివరించారు. ఈ రాకెట్ రూపకల్పనకు రూ. 325 కోట్లు ఖర్చయ్యాయి. కాగా తొమ్మిది నెలలో ఇది రెండవ వైఫల్యం కావడం గమనార్హం.

వెబ్దునియా పై చదవండి