ప్రసార భారతి తాత్కాలిక సీఈఓగా రాజీవ్ ఠాక్రూ నియామకం

ప్రసార భారతి తాత్కాలిక ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ)గా రాజీవ్ ఠాక్రూను కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఈయన ప్రస్తుతం కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ అదనపు కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు కేంద్రం సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది.

ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్టు ఆరోపణలు రావడంతో ప్రసార భారతి సీఈఓగా బీఎస్‌ లల్లీని ఇటీవల సస్పెండ్‌ చేసిన విషయం తెల్సిందే. ఆయన స్థానంలో ఠాక్రూను నియామించారు. ప్రస్తుతం లల్లీపై విచారణకు ఆదేశాలు జారీ అయ్యాయి.

న్యూఢిల్లీలో ప్రసార భారతి బోర్డు సమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం, సుప్రీం కోర్టు ఆదేశం మేరకు లల్లీపై జరుగుతున్న విచారణ పూర్తయ్యేంత వరకు ఠాక్రూ తాత్కాలికంగా సీఈఓగా బాధ్యతలు నిర్వర్తిస్తారని కేంద్ర తన ప్రకటనలో పేర్కొంది.

వెబ్దునియా పై చదవండి