ప్రణబ్‌తో సమావేశం కానున్న తెలంగాణ ప్రాంత నేతలు!!

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశం కీలక దశకు చేరుకుంది. ఈ అంశంపై ఓ నిర్ణయం తీసుకునేందుకు తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ ఎంపీలతో ఆ పార్టీ అధిష్టానం బుధవారం రాత్రి సమావేశం కానుంది. కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ వీరితో భేటీ కానున్నారు. ఈ భేటీలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశంపై ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.

లక్ష్య సాధన అంశంపై మంగళవారం సమావేశమైన కాంగ్రెస్ తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు ఇకపై ఊరుకునేదిలేదని, అధిష్టానాన్ని నిలదీయాల్సిందేనని, ఇందుకోసం అవసరమైతే రాజీనామాలు కూడా చేయాలని వారు తీర్మానించారు. దీంతో అధిష్టానం ఉలిక్కిపడిన హైకమాండ్ హుటాహుటిన రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ వీరప్ప మొయిలీని రాష్ట్రానికి పంపించింది.

ఆయన హైదరాబాద్ వచ్చీరాగానే సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్, పీసీసీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్‌లతో సమావేశమయ్యారు. ఇదిలావుండగా, ఢిల్లీలో జగన్ చేపట్టిన జలదీక్షలో సొంత పార్టీకి చెందిన 24 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు పాల్గొన్న అంశాన్ని కూడా వారు చర్చించారు.

వెబ్దునియా పై చదవండి