అనంతరం వైస్ ప్రెసిడెంట్ నాగబాబు తో పాటు కోశాదికారి, ఆడిటర్ లు అసోసియేషన్స్ లెక్కలు చూస్తుండగా చిన్నపాటి రభస జరిగిందని సభ్యులు తెలిపారు. లెక్కలు సరిగా లేవని వైస్ ప్రెసిడెంట్ నాగబాబు నిలదీయడంతో జనరల్ సెక్రటరీ హుమాయూన్ సీరియస్ అయినట్లు తెలిసింది. అసలు లెక్కలు నువ్వెందుకు చూస్తున్నావని గొడవపడటం జరిగింది. ఇక ఆరోజు రాత్రి వైస్ ప్రెసిడెంట్ నాగబాబు పై రాత్రి కొందరు దాడి చేసారు. విషయం తెలిసిన మిగిలిన సభ్యులు పోలీస్ కేసు పెట్టారు.
కాగా, హుమాయూన్ చాలా కాలంగా ఆరోపణలు ఉన్నాయని తెలిసింది. తెహర్ అవుట్ డోర్ యూనిట్ పేరుతో వ్యాపారం చేస్తూ, అసోసియేషన్ పేరు దుర్వినియోగం చేస్తున్నాడని ప్రదాన ఆరోపణ. తెలంగాణ కు చెందిన హుమాయూన్ కు రాజకీయ సపోర్ట్, ఫెడరేషన్ ప్రెసిడెంట్ అనిల్ వల్లభ నేని తోడుకావడంతో పలు అక్రమాలకు పాలపడుతున్నాడని సభ్యులు ఆరోపిస్తున్నారు. అందుకే రేపు అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకునేందుకు పోలీస్ పర్మిషన్ తేసుకున్నారు. దానిని వాయిదా వేసేలా ప్రుస్తుత కమిటి పావులు కదుపుతుందని సమాచారం.