నక్సలైట్లు హింసాత్మక పంథాను వీడాలి: ఎల్.కె.అద్వానీ

మావోయిస్టులు ప్రజాస్వామ్య వ్యవస్థపై నమ్మకం కలిగివుండాలని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత ఎల్.కె. అద్వానీ పేర్కొన్నారు. నక్సల్స్ సమస్య దేశీయమైందే. కానీ దీని మూలాలు విదేశాల్లో లేవు కాబట్టి ప్రజాస్వామ్య వ్యవస్థపై నమ్మకం కలిగివుండాల్సిందేనని అద్వానీ పేర్కొన్నారు.

నక్సలైట్లు హింసాత్మక పంథాను విడనాడాలని ఆయన కోరారు. దీనివల్ల ఎవరికీ ప్రయోజనం ఉండకపోగా.. వారి ప్రభావం ఉన్న ప్రాంతాల్లో అభివృద్ధి కుంటుపడుతుందని పేర్కొన్నారు.

ప్రభుత్వం అమలు పరచే అభివృద్ధి కార్యక్రమాలు మారుమూల గిరిజన ప్రాంతాలకు సక్రమంగా అందాలంటే నక్సల్స్ ప్రధానంగా ప్రజాస్వామ్య వ్యవస్థపై విశ్వాసముంచి అందుకనుగుణంగా తమ విధానాలను మార్చుకోవాలని అద్వానీ పిలుపునిచ్చారు.

వెబ్దునియా పై చదవండి