సుప్రీంకోర్టు ఆదేశంతో తెరుచుకోనున్న డ్యాన్స్ బార్లు!

బుధవారం, 17 జులై 2013 (08:44 IST)
File
FILE
సుప్రీం కోర్టు ఆదేశంతో మహారాష్ట్రలో మళ్లీ డ్యాన్స్ బార్ల తలపులు మళ్లీ తెరుచుకోనున్నాయి. గతంలో ఈ బార్లపై బాంబే హైకోర్టు విధించిన నిషేధాన్ని తొలగిస్తూ సుప్రీం కోర్టు మంగళవారం ఆదేశాలు జారీ చేసిన విషయం తెల్సిందే. దీంతో మళ్లీ బార్లలో డాన్సులు వచ్చే అవకాశం కనబడుతోంది. తాజాగా సుప్రీం ఇచ్చిన తీర్పుతో నైట్ బార్లలో మహిళా నృత్యాలను నిషేధిస్తూ ఆరేళ్ల క్రితం మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నిర్ణయానికి బ్రేక్ పడనుంది.

మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని బాంబే హైకోర్టు గతంలో సమర్థించింది. ఈ తీర్పుపై కొందరు డాన్సర్లు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ నిర్ణయం వల్ల తమ ఉపాధి కోల్పోతామని వారు వాదించారు. బహుశా వారి తరపున బార్ ఓనర్లే వెళ్లి ఉండాలి.

ఆ మీదట కేసును విచారించిన సుప్రింకోర్టు డాన్స్ బార్లపై బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. దీంతో మళ్లీ డాన్స్ బార్లు రావడానికి అవకాశం ఏర్పడింది.

వెబ్దునియా పై చదవండి