రాజీవ్ ముద్దాయిలకు ఉరిశిక్ష రద్దు చేసిన సుప్రీంకోర్టు!

మంగళవారం, 18 ఫిబ్రవరి 2014 (12:58 IST)
File
FILE
దివగంత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హత్య కేసులో ప్రధాన ముద్దాయిలుగా తేలిన ఎల్టీటీఈ తీవ్రవాదులకు సుప్రీంకోర్టు మరణశిక్షలను రద్దు చేసి, వాటిస్థానంలో యావజ్జీవ కారాగారశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. ఈ మేరకు.. మంగళవారం దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పును వెలువరించింది.

ఈ హత్య కేసులో ప్రధాన ముద్దాయిలైన శంతన్, మురుగన్, పెరారివలన్‌లు గత నెలలో తమ మరణశిక్షలను జీవితఖైదుగా మార్చాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసుకున్నారు.

తాము పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్‌పై నిర్ణయం ఆలస్యం కావడంతో కోర్టును ఆశ్రయించిన తమకు జీవితఖైదుగా మార్చాలని విజ్ఞప్తి చేశారు. దీన్ని పరిశీలించిన కోర్టు ముద్దాయిలకు అనుకూలంగా తీర్పును వెలువరించింది.

వెబ్దునియా పై చదవండి