''శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తిగానరసం ఫణిః'' అనే ప్రమాణం- శిశువులను పశువులనే గాక విషసర్పాలను గూడా సమ్మోహింపచేయగల శక్తి సంగీతానికున్నది. స్వరాలు, భాష ఏదైనా సుమధుర స్వరంతో ఆలపించే గాయకుడి పాటను వింటుంటే మనసు ఎటో వెళ్లిపోతుంది. అన్నీ మరిచిపోయి మరో లోకంలో విహరిస్తుంది.