ఏ రాశులకు అష్టమి, నవమి తిథులు అనుకూలిస్తాయి..!?

గురువారం, 13 అక్టోబరు 2011 (14:25 IST)
FILE
పరమాత్మ కృష్ణుడు జన్మించిన అష్టమిని, ఏకపత్నీవ్రతుడు శ్రీరాముడు జన్మించిన అష్టమి నవమి తిథులను అందరూ పండుగ చేసుకుంటున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే అష్టమి, నవమి తిథుల్లో ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించడం మంచిదేనా అనేది తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే.

సాధారణంగా అష్టమి, నవమి తిథుల్లో ప్రారంభించిన కార్యాలు ఆశించిన స్థాయిలో అనుకూలిస్తాయని చెప్పలేం. అయితే నవరాత్రుల్లో వచ్చే అష్టమి, నవమి తిథుల్లో మాత్రం ఏ శుభకార్యాన్నైనా ప్రారంభించవచ్చునని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.

8, 17, 26 తేదీల్లో పుట్టిన జాతకులు అష్టమిలో ఎలాంటి కార్యాన్నైనా ప్రారంభించవచ్చు. వీరికి అష్టమితో కలిగే దుష్ఫలితాల ప్రభావం అంతగా ఉండదు. ఎందుకంటే అష్టమి అనేది ఎనిమిదో తిథి. అందుచేత 8వ సంఖ్యగా పరిగణిస్తున్న 8, 17, 26 తేదీల్లో జన్మించిన జాతకులకు ఈ తిథి అనుకూలిస్తుంది.

అదేవిధంగా జ్యోతిష్యం ప్రకారం 8వ స్థానానికి శనిభగవానుడు ఆధిక్యం వహిస్తాడు. కాబట్టి మకర, కుంభ రాశి జాతకులు అష్టమి తిథిలో ఎలాంటి మంచి కార్యాన్నైనా ప్రారంభించవచ్చు. ఇంకా శని భగవానుడి ఆధిక్యంలో జన్మించిన జాతకులకు అష్టమి తిథి అన్ని విధాలా అనుకూలిస్తుంది.

ఇక నవమి తొమ్మిదో తిథిగా పరిగణింపబడుతోంది. 9, 18, 27 తేదీల్లో జన్మించిన జాతకులకు ఈ తిథి ప్రత్యేకంగా ఉంటుంది. కుజునితో ఆధిక్యం గల ఈ తిథి అయినప్పటికీ, మేషరాశి, వృశ్చికరాశిలో జన్మించిన జాతకులు ఈ తిథిలో ఎటువంటి శుభకార్యాన్నైనా ఆరంభించవచ్చునని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.

వెబ్దునియా పై చదవండి