కుజ దోషం- కుజుని ఆధిపత్యంతో కలిగే దోషం. కుజునికి అంగారకుడు అనే మరో పేరున్న విషయం తెలిసిందే. ఈ దోషంతోటివారు వివాహ ఫలాలను అనుసరించే వారు జాతకాల్లోని కుజుని దశాకాలం, ఆధిపత్యం ఒకే విధంగా ఉండేలా చూసుకోవాలి. ఒకే విధమైన ఆధిపత్యంతో గల కుజదోషం కలవారు వివాహం చేసుకోవచ్చు.
కుజుడు జన్మలగ్నంలో ఉన్నప్పుడు చంద్రుడు, శుక్రునితో కలిసియుంటే లేదా కుజుడు 2, 4, 7, 8, 12 స్థానాల్లో ఉంటే కుజ దోషం తప్పక ఉన్నట్టే. పై స్థానాల్లో కుజుని ఆధిపత్యం మాత్రమే కాకుండా సూర్య, గురు, రాహు, కేతువులతో పాటు కుజుడు ఆధిపత్యం వహించినట్లయితే... లేదా ఆ గ్రహాల దృష్టి కుజునిపై పడే విధంగా ఉంటే కుజదోషానికి పరిహారాలున్నాయి.
అందులో ముఖ్యంగా... 1. జాతకం ప్రకారం స్త్రీ, పురుషులిద్దరికి ఒకే విధమైన పూర్ణవంతమైన దోషాన్ని కలిగియుండాలి. (లేక) 2. స్త్రీ, పురుషులకు ఎటువంటి దోషమూ ఉండకూడదు. ఇలా కాకుండా కుజుని దశ ఇద్దరికి ముగించే స్థాయిలో ఉన్న పక్షంలో కుజదోషస్థులు వివాహం చేసుకోవచ్చు.
పుత్ర దోషం - పుత్ర సంతానం ఉందా లేదన్న విషయాన్ని జాతకపరంగా తెలుసుకోవాలంటే పురుషుని జాతకాన్నిబట్టి చూడటం పరిపాటి. ప్రతి జాతకునికి ఐదోస్థానం పుత్ర స్థానంగా పరిగణించబడుతుంది. పుత్రకారకునిగా బుధుడు ఆధిపత్యం వహిస్తాడు.
గురువు శుభస్థాన ఆధిపత్యం వహిస్తే జాతకులకు పుత్రప్రాప్తి తప్పకుండా లభిస్తుంది. ఐదో స్థానంలో రాహు- కేతులుంటే పుత్రదోషం ఉంటుంది. దీనికే "నాగదోషమని" పేరు. ఈ దోషం గల జాతకులు తప్పకుండా నాగదోష పరిహారం చేయాలి. అలా చేసిన పక్షంలో నాగదోషం తొలగిపోవటంతో పాటు పుత్రప్రాప్తి లభిస్తుంది.
పరిహారాలు 1. పుత్ర దోషం కలవారు నాగ విగ్రహ సమేతంగా గల వేపచెట్టు, మర్రి చెట్టులను 41 రోజులు ప్రదక్షిణ చేయాలి. 41 వరోజు అర్చన చేయాలి. 2. వెండితో నాగ ప్రతిమను తయారు చేసి ఒక మండలం (41రోజులు) పూజచేసి శివాలయాల్లో సమర్పించటమో లేక హుండీలలో వేయటమో చేయాలి. 3. రామేశ్వరం, శ్రీ కాళహస్తి లాంటి పుణ్యక్షేత్రాలలో నాగదోష నివారణకు పూజలు చేసి పరమేశ్వరుని ధ్యానించటం ద్వారా పుత్రప్రాప్తి లభించటంతో పాటు పుత్రదోషం తొలగిపోతుంది.