చేతివేళ్లపై చక్రాలు - శంఖులు... వాటి ఫలితాలు

శుక్రవారం, 22 జూన్ 2012 (13:34 IST)
WD
పంచాంగంలో చేతి వేళ్లపై ఉన్న చక్రాలు, శంఖులు జీవితంలో వివిధ రకాలైన ఫలితాలను ఇస్తాయంటున్నారు. ఏక చక్ర స్సదాభోగీ... అంటే... చేతి వేళ్లలో ఒక చక్రం కలవాడు ఎప్పుడునూ భోగములను అనుభవిస్తుంటాడు. రెండు చక్రములు కలవారు రాజులచే పూజింపబడతారు.

మూడు చక్రములున్నవారు ధనవంతులవుతారు. నాలుగు చక్రాలు కలవారు దరిద్రులవుతారు. ఐదు చక్రాలున్నవారు విలాసవంతులుగా ఉంటారు. చేతి వేళ్లపై ఆరు చక్రాలను కలిగిన వారు ఎక్కువ కామము కలిగి ఉంటారు.

ఇక ఏడు చక్రాలుంటే సౌఖ్యవంతులుగా ఉంటారు. ఎనిమిది చక్రాలున్నవారు రోగపీడుతులుగా ఉంటారు. తొమ్మిది చక్రాలున్నవారు రాజ స్థానాన్ని ఆక్రమిస్తారు. పది చక్రములు ఉన్నట్లయితే గొప్ప యోగవంతుడుగా తులతూగుతారు.

వెబ్దునియా పై చదవండి