జ్యేష్ట నక్షత్రంలో పుట్టారా..? అయితే విమర్శలు సహించలేరు!
FILE
జ్యేష్ట నక్షత్రంలో పుట్టిన జాతకులు సందర్భానుసారంగా అభిప్రాయాలు మార్చుకుంటారని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. ఈ నక్షత్రంలో పుట్టిన జాతకులు తమ రహస్యాలను కాపాడుకోవడానికి ఇతరుల రహస్యాలను తెలుసుకుంటారు. చిన్న విషయాలను కూడా సూక్ష్మంగా పరిశీలించి, లోపాలను ఎంచుకుంటారు.
విశేషమైన దైవభక్తి, సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుండే ఈ జాతకులు, తగాదాలు పెట్టడమే ధ్యేయంగా జీవిస్తున్నారనే విమర్శలు ఎదుర్కొంటారు. సాంకేతిక వైద్య విద్యలలో రాణించే ఈ జాతకులు తమపై వస్తున్న విమర్శలను ఏ మాత్రం సహించలేరు.
ఇతరులు చేసే సహాయాన్ని హక్కులుగా వాడుకునే జ్యేష్ట నక్షత్ర జాతకులు, ఇచ్చిన వాగ్ధానం నిలబెట్టుకోరు. ఇతర భాషల్లో ప్రావీణ్యం కలిగిన ఈ జాతకులకు అనోన్య దాంపత్యం, సౌకర్యవంతమైన ఉద్యోగం వీరికి లభిస్తుంది. కానీ వ్యసనాలకు దూరంగా ఉంటే జీవితం బాగుంటుందని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవడం కూడదని వారు సలహా ఇస్తున్నారు.
అలాగే ఒక రకమైన ఆత్మ న్యూన్యతా భావం కలిగివుండే ఈ జాతకులు ఎదుటి వాళ్ళు సరదాగా చేసిన వ్యాఖ్యలను కూడా తమను కించపరచడానికేనని తప్పుగా అర్థం చేసుకుంటారు.
ఇకపోతే.. ఈ జ్యేష్ట నక్షత్రంలో పుట్టిన జాతకులకు పసుపు, నలుపు రంగులు కలిసివస్తాయి. ఇంకా మంగళవారం వీరికి అన్ని విధాలా అనుకూలిస్తుంది. అలాగే సోమ, బుధవారాలు సామాన్య ఫలితాలనిస్తాయి. జ్యేష్ట నక్షత్రంలో పుట్టిన జాతకులకు 9వ సంఖ్య అన్ని విధాలా కలిసివస్తుంది. అలాగే 9, 18, 36, 1, 2, 3 అనే సంఖ్యలు కూడా అన్ని విధాలా అనుకూలిస్తాయి. కానీ 4, 5, 6 అనే సంఖ్యలు ఈ జాతకులకు కలిసిరావని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.