వాక్చాతుర్యంతో నెట్టుకొస్తారు. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. వ్యతిరేకులను సైతం ఆకట్టుకుంటారు. సంప్రదింపులకు అనుకూలం. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. ఖర్చులు సామాన్యం. కొత్త పనులు చేపడతారు. కీలక చర్చల్లో పాల్గొంటారు.
కార్యసాధనలో సఫలీకృతులవుతారు. సంకల్పం సిద్ధిస్తుంది. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. యత్నాలను ఆప్తులు ప్రోత్సహిస్తారు. పలుకుబడి ఉన్న వారితో పరిచయాలేర్పడతాయి. వస్తులాభం, వస్త్రప్రాప్తి పొందుతారు. వివాదాస్పద విషయాల జోలికి పోవద్దు.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
అనవసర ఒత్తిడికి గురికావద్దు. ఆందోళన కలిగించిన సమస్య నిదానంగా సద్దుమణుగుతుంది. ఆర్భాటాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. కొన్ని విషయాలు చూసీచూడనట్టు వదిలేయండి. శుభకార్యానికి హాజరవుతారు.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
సర్వత్రా అనుకూలం. అవకాశాలను చేజిక్కించుకుంటారు. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. పనులు వేగవంతమవుతాయి. పొదుపు ధనం అందుతుంది. ఖర్చులు సామాన్యం. దంపతులు ఏకాభిప్రాయానికి రాగల్గుతారు. వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి.
నిర్దేశిత ప్రణాళికలతో యత్నాలు సాగిస్తారు. కష్టమనుకున్న పనులు తేలికవుతాయి. ఖర్చులు అదుపులో ఉండవు. ఆప్తులు సాయం అందిస్తారు. లావాదేవీలతో తీరిక ఉండదు. కొత్తసమస్య ఎదురవుతుంది. న్యాయ నిపుణులను సంప్రదిస్తారు. ఆలయాలు సందర్శిస్తారు.
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. గుట్టుగా మెలగండి. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. పెద్దఖర్చు తగిలే సూచనలున్నాయి. ప్రముఖుల సందర్శనం వీలుపడదు. పనులు, కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. పిల్లల విద్యాయత్నం ఫలిస్తుంది. ఆందోళన తగ్గి స్థిమితపడతారు.
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
ఏకాగ్రత తగ్గకుండా చూసుకోండి. కొందరి వ్యాఖ్యలు ఉద్రేకపరుస్తాయి. ధైర్యంగా ముందుకు సాగండి. కృషి ఫలించకున్నా అధైర్యపడవద్దు. శుభవార్త వింటారు. దుబారా ఖర్చులు విపరీతం. పనులు ఒక పట్టాన సాగవు. చీటికిమాటికి చికాకుపడతారు.
ఆదాయం బాగున్నా సంతృప్తి ఉండదు. తెలియని వెలితి వెన్నాడుతుంది. ఖర్చులు సామాన్యం. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. అనవసర జోక్యం తగదు. ఇతరుల బాధ్యతలు చేపట్టిన ఇబ్బందులెదుర్కుంటారు, ఆత్మీయులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది.
మీ కృషి ఫలిస్తుంది. కార్యసిద్ధి, వ్యవహార జయం ఉన్నాయి. ప్రముఖులను ఆకట్టుకుంటారు. పనులు వేగవంతమవుతాయి. ఖర్చులు విపరీతం. శనివారం నాడు నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. బాధ్యతలు అప్పగించవద్దు. లావాదేవీల్లో ఏకాగ్రత వహించండి.
ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. శ్రమతో కూడిన ఫలితాలున్నాయి. వాయిదా పడిన పనులు పునఃప్రారంభిస్తారు. అవకాశాలు కలిసివస్తాయి. వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి. వాహనసౌఖ్యం పొందుతారు. ఖర్చులు అధికం. చెల్లింపుల్లో జాగ్రత్త.
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
వ్యవహారానుకూలత ఉంది. ఎంతటివారినైనా ఇట్టే ఆకట్టుకుంటారు. తలపెట్టిన కార్యం విజయవంతమవుతుంది. పెట్టుబడులకు తరుణం కాదు. పెద్దలను సంప్రదించండి. చెల్లింపుల్లో జాప్యం తగదు. స్థిమితంగా పనులు పూర్తి చేస్తారు. మీ చొరవతో ఒక సమస్య పరిష్కారమవుతుంది.