21-06-2025 శనివారం దినఫలితాలు - బెట్టింగుల జోలికి పోవద్దు....

రామన్

శనివారం, 21 జూన్ 2025 (04:00 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
అభియోగాలకు ధీటుగా స్పందిస్తారు. పొదుపు ధనం అందుకుంటారు. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. మనోధైర్యంతో తీసుకున్న నిర్ణయం సత్ఫలితమిస్తుంది. పనులు పురమాయించవద్దు. అనవసర జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
కార్యసిద్ధికి ఓర్పు ప్రధానం. ఉత్సాహంగా శ్రమించండి. రావలసిన ధనాన్ని లౌక్యంగా రాబట్టుకోవాలి. ఖర్చులు విపరీతం. బంధువుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. మీ శ్రీమతిని కష్టపెటవద్దు. కీలక వ్యవహారంలో అప్రమత్తంగా ఉండాలి. బెట్టింగుల జోలికి పోవద్దు. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. సాయం ఆశించవద్దు. మనోధైర్యంతో యత్నాలు సాగించండి. మీ కృషి వెంటనే ఫలిస్తుంది. పెద్దఖర్చు తగిలే సూచనలున్నాయి. సంతానం విద్యాయత్నం ఫలిస్తుంది కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
లక్ష్యాన్ని సాధిస్తారు. ఖర్చులు అదుపులో ఉండవు. రుణాలు, చబదుళ్లు స్వీకరిస్తారు. పనులు సానుకూలమవుతాయి. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. కొత్తవ్యక్తులతో మితంగా సంభాషించండి. పత్రాల రెన్యువల్లో జాప్యం తగదు. ప్రయాణం తలపెడతారు. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
పనులు నిర్విఘ్నంగా సాగుతాయి. ఆపన్నులకు సాయం చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. కీలక సమావేశంలో పాల్గొంటారు. వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
లావాదేవీలు ప్రశాంతంగా సాగుతాయి. ఒత్తిడికి గురికావద్దు. స్థిమితంగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఒత్తిళ్లు, భేషజాలకు పోవద్దు. పనులు చురుకుగా సాగుతాయి. ఆత్మీయులతో సంభాషిస్తారు. వ్యాపకాలు అధికమవుతాయి. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
మీ కష్టం ఫలిస్తుంది. అనుకున్న లక్ష్యం సాధిస్తారు. స్థిరాస్తి ధనం అందుతుంది. ప్రణాళికలు వేసుకుంటారు. సమర్ధతకు గుర్తింపు లభిస్తుంది. వేడుకను ఘనంగా చేస్తారు. బంధుత్వాలు బలపడతాయి. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి. ప్రయాణ లక్ష్యం నెరవేరుతుంది. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
అవకాశాలు అందినట్టే చేజారిపోతాయి. కష్టించినా ఫలితం ఉండదు. చిన్న విషయానికే చికాకుపడుతుంటారు. ఆప్తులను కలుసుకుంటారు. ఇతరులకు పనులు అప్పగించవద్దు. ఖర్చులు విపరీతం. రాబడిపై దృష్టిపెడతారు. ముఖ్యుల సందర్శనం వీలుపడదు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
సమయానికి ధనం అందుతుంది. రుణవిముక్తులవుతారు. ఖర్చులు సామాన్యం. గృహం ప్రశాంతంగా ఉంటుంది. కొత్త పనులు చేపడతారు. మీ కృషి ఫలిస్తుంది. స్థిరాస్తి వ్యవహరంలో అప్రమత్తంగా ఉండాలి. ప్రముఖులతో సమస్యలు తలెత్తకుండా మెలగండి.
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, పాదాలు
మాటతీరుతో ఎదుటివారిని ఆకట్టుకుంటారు. ఒక వార్త సంతోషం కలిగిస్తుంది. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. మీ కృషిలో లోపం లేకుండా చూసుకోండి. విలాసాలకు ఖర్చుచేస్తారు. మీ శ్రీమతి వద్ద ఏదీ దాచవద్దు. వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి.
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. మీ కృషి ఫలిస్తుంది. పొదుపు ధనం అందుకుంటారు. ఖర్చులు విపరీతం. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. చేసిన పనులే తిరిగి చేయవలసి వస్తుంది.
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
మీదైన రంగంలో పురోగమిస్తారు. మీ కృషి ప్రశంసనీయమవుతుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. పనులు మధ్యలో ఆపివేయొద్దు. ఖర్చులు విపరీతం. నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. సంతానం విద్యాయత్నం ఫలిస్తుంది. ప్రయాణంలో అవస్థలు ఎదుర్కుంటారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు