శ్రవణా నక్షత్రంలో జన్మించిన వారిని సకలగుణ సంపన్నులుగా ఉంటారని జ్యోతిష్కులు అంటున్నారు. అధిక ప్రజ్ఞాశక్తి కలిగి ఉండటం, ఇతరులకు సాయం చేయడం, మనోధైర్యంతో సాహసవంతమైన నిర్ణయాలు తీసుకోవడం వీరి నైజం.
ఏ విషయాన్నైనా అంతర్గత ఆలోచించే వీరికి ఓర్పు కాస్త ఎక్కువ. అయితే కొన్నిసార్లు సహనం కోల్పోతారు. వీరికి ధైర్యం, మనోనిబ్బరం ఎక్కువగా ఉంటుంది. జీవితంలో అంచెలంచెలుగా పైకి వస్తారు.
చేసిన సాయాన్ని గురించి ఇతరులకు చెప్పుకోని మనసత్త్వం కలిగి ఉంటారు. చదువు పట్ల శ్రద్ధ వహించడంతో సమాజంలో మంచి స్థానం సంపాదిస్తారు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ పరిస్థితులను బట్టి నిర్ణయాలు మార్చుకుంటారు.
శ్రవణా నక్షత్రం చంద్రగ్రహ నక్షత్రం. ఈ నక్షత్రానికి అధి దేవత మహావిష్ణువు. దేవ గణానికి చెందిన ఈ నక్షత్రం అంత్యనాడి, వానర యోని కల్గి ఉంటుంది. ఈ నక్షత్ర నియంత్రాణా వృక్షము జిల్లేడు. ఈ నక్షత్రంలో జన్మించిన వారు వీలైనంత తక్కువగా మాట్లాడే స్వభావాన్ని కల్గి ఉంటారు.