ఆదివారం వచ్చే అష్టమి నాడు ఉపవాసం ఉండడం వల్ల పాపాలు నశిస్తాయి. కాలభైరవునికి ఒక నెయ్యి దీపం వెలిగించి పండ్లు నైవేద్యంగా సమర్పించాలి. ఈ రోజున దానధర్మాలు చేయడం, పేదలకు ఆహారం ఇవ్వడం చాలా పుణ్యం. ఈ రోజున కాలభైరవుడి ఆలయాన్ని భక్తులు సందర్శించాలి. ఉపవాసం ఉండి, భగవంతుని ప్రార్ధనలు చేస్తారు.
కాలభైరవుడు శివుని ఉగ్రరూపం. కాలభైరవుడు కాశీ క్షేత్రపాలకుడు. ఈ క్రూరమైన రూపం అజ్ఞానం, చెడు, అహంకారం నాశనాన్ని సూచిస్తుంది. కాల భైరవుడు భక్తులకు రక్షకుడు. కామం, కోపం, దురాశ, అహంకారం వంటి ఐదు రకాల చెడు అంశాలను తొలగిస్తాడు. కాల భైరవుడిని అత్యంత భక్తితో, పవిత్రతతో పూజించేవారికి ఆనందం, శ్రేయస్సు లభిస్తుంది. శత్రువులు, దుష్టశక్తుల నుండి రక్షణ ఇస్తాడు.
కుక్కలకు పాలు, పెరుగు, స్వీట్లు అందజేస్తారు.
కాశీ వంటి పుణ్యక్షేత్రాలలో బ్రాహ్మణులకు ఆహారం అందించడం అత్యంత ప్రతిఫలంగా పరిగణించబడుతుంది.