ఆర్థికలావాదేవీలతో సతమతమవుతారు. తప్పటడుగు వేసే ఆస్కారం ఉంది. అనుభవజ్ఞుల సలహా పాటించండి. రోజువారీ ఖర్చులే ఉంటాయి. ఆత్మీయులతో సంభాషిస్తారు. చేపట్టిన పనులు ఒక పట్టాన పూర్తికావు. ఆరోగ్యం బాగుంటుంది. ఆలయాలు సందర్శిస్తారు.
ప్రతికూలతలను అనుకూలతలుగా మలుచుకుంటారు. మీ సమర్ధతపై నమ్మకం కలుగుతుంది. ప్రణాళికాబద్ధంగా అడుగులేస్తారు. బాధ్యతలు అప్పగించవద్దు. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. రశీదులు, పత్రాలు జాగ్రత్త. పనులు వేగవంతమవుతాయి.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
లావాదేవీల్లో ఒత్తిడికి గురికావద్దు. అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. పనుల్లో శ్రమ అధికం. ఒక సమాచారం ఊరటనిస్తుంది. దుబారా ఖర్చులు విపరీతం. ముఖ్యుల కలయిక వీలుపడదు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. మొండిగా కార్యక్రమాలు కొనసాగిస్తారు.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
లక్ష్యాన్ని సాధిస్తారు. ఒత్తిడి పెరుగకుండా చూసుకోండి. ఖర్చులు అదుపులో ఉండవు. చెల్లింపులు వాయిదా వేసుకుంటారు. పనులు సానుకూలమవుతాయి. పత్రాలు అందుకుంటారు. మీ చొరవతో ఒకరికి మంచి జరుగుతుంది. వేడుకకు హాజరవుతారు.
చాకచక్యంగా వ్యవహరిస్తారు. మీ సమర్థతపై ఎదుటి వారికి గురి కుదురుతుంది. స్థిమితంగా పనులు పూర్తి చేస్తారు. రావలసిన ధనం అందుతుంది. కొందరి మాటతీరు కష్టమనిపిస్తుంది. మీ చొరవతో శుభకార్యం నిశ్చయమవుతుంది. ఏకాగ్రతతో వాహనం నడపండి.
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
కార్యక్రమాలు నిరాటంకంగా సాగుతాయి. అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. ఖర్చులు విపరీతం. సభ్యత్వాలు, బాధ్యతలు స్వీకరిస్తారు. మీ కలుపుగోలుతనం ఆకట్టుకుంటుంది. ప్రముఖులకు సన్నిహితులవుతారు. ఆగిపోయిన పనులు పునఃప్రారంభమవుతాయి.
ఒత్తిడి పెరగకుండా చూసుకోండి. కొందరి వ్యాఖ్యలు ఉద్రేకపరుస్తాయి. ఏ విషయాన్నీ పెద్దగా పట్టించుకోవద్దు. పనులు చురుకుగా సాగుతాయి. ఖర్చులు అధికం. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. పిల్లల దూకుడు కట్టడి చేయండి.
మాట నిలబెట్టుకుంటారు. కొంతమొత్తం ధనం అందుతుంది. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. కీలక పత్రాలు జాగ్రత్త. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. దంపతుల మధ్య అకారణ కలహం. పెద్దల చొరవతో సమస్య సద్దుమణుగుతుంది.
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. అకాలభోజనం, విశ్రాంతి లోపం. ఆలోచనలతో సతమతమవుతారు. ఖర్చులు అధికం, పనులు ఒక పట్టాన పూర్తి కావు. చీటికిమాటికి చికాకుపడతారు. ఆత్మీయుల రాక ఉపశమనం కలిగిస్తుంది. వివాదాలు సద్దుమణుగుతాయి.
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
శ్రమతో కూడిన ఫలితాలున్నాయి. ఉచితంగా ఏదీ ఆశించవద్దు. మీ సామర్థంపై నమ్మకం పెంచుకోండి. దూరపు బంధువులతో సంభాషిస్తారు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. దుబార్ ఖర్చులు విపరీతం. చేపట్టిన పనులు సావకాశంగా పూర్తిచేస్తారు.