ఫాల్గుణ పౌర్ణమి.. మహావిష్ణువును, శ్రీలక్ష్మిని పూజిస్తే...?

సోమవారం, 6 మార్చి 2023 (22:19 IST)
ఫాల్గుణ పౌర్ణమి రోజున పౌర్ణమి వ్రతం ఆచరించే వారికి సర్వశుభాలు చేకూరుతాయి. రోజంతా ఉపవసించి పౌర్ణమి చంద్రునికి రవ్వతో చేసిన వంటకాలను సమర్పిస్తే అనుకున్న కోరికలు నెరవేరుతాయి. అలాగే ఈ రోజున శ్రీహరిని పూజించడం వల్ల ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది.
 
అలాగే ఫాల్గుణ పౌర్ణమి రోజున శ్రీ మహాలక్ష్మి జయంతి రావడంతో అష్టైశ్వర్యాల కోసం ఈ రోజున శ్రీలక్ష్మిని పూజించవచ్చు. పౌర్ణమి రోజున సాయంత్రం శ్రీమహాలక్ష్మిని ప్రార్ధిస్తే అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. అమ్మవారికి ఇష్టమైన సన్నజాజి పూలను మాలగా గుచ్చి సమర్పిస్తే చేపట్టిన కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. 
 
కలకండ, దద్ధ్యోజనం నైవేద్యంగా సమర్పించడం ద్వారా సుఖసంతోషాలు వెల్లివిరిస్తున్నాయి.ఆవునేయి లేదా కొబ్బరి నూనెతో కానీ దీపారాధన చేయాలి. ఈ నైవేద్యాన్ని ప్రసాదంగా తీసుకుంటే సకల దోషాలు, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఉసిరికాయతో శ్రీ విష్ణువుకు దీపం వెలిగిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి 
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు