మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
తలపెట్టిన కార్యం విజయవంతమవుతుంది. ముఖ్యమైన వ్యవహారంలో అయిన వారు సాయం చేస్తారు. ఆశలొదిలేసుకున్న ధనం అందుతుంది. ఖర్చులు అదుపులో ఉండవు. చెల్లింపులు వాయిదా వేసుకుంటారు. ఆదివారం నాడు పనులు మందకొడిగా సాగుతాయి. దంపతులు ఏకాభిప్రాయం నెలకొంటుంది. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. కొత్త యత్నాలు మొదలెడతారు. దూరపు బంధువులతో సంభాషిస్తారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. న్యాయ నిపుణులను సంప్రదిస్తారు. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. ఆరోగ్యం సంతృప్తికరం. ధార్మిక విషయాల పట్ల ఆసక్తి కలుగుతుంది. వ్యాపారాల్లో లాభనష్టాలను సమీక్షించుకుంటారు. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. ఉద్యోగస్తులకు పదోన్నతి. రిటైర్డు అధికారులకు వీడ్కోలు పలుకుతారు.
శ్రమతో కూడిన ఫలితాలున్నాయి. ఆశావహదృక్పథంతో మెలగండి. ఒత్తిళ్లకు గురికావద్దు. పరిస్థితులు త్వరలో చక్కబడతాయి. సన్నిహితుల వ్యాఖ్యలు కార్యోన్ముఖులను చేస్తాయి. ధైర్యంగా యత్నాలు సాగిస్తారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. ఆత్మీయులతో తరచుగా సంభాషిస్తుంటారు. ఖర్చులు విపరీతం. చెల్లింపులను అలక్ష్యం చేయయండి. మీ నిర్లక్ష్యం ఇబ్బందులకు దారి తీస్తుంది. బుధవారం నాడు పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి. మీ శ్రీమతి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇంటి విషయాలపై దృష్టి పెడతారు. దూరపు బంధువుల ఆహ్వానం అందుకుంటారు. ఉద్యోగస్తులకు ఓర్పు, ఏకాగ్రత ప్రధానం. ప్రలోభాలకు లొంగవద్దు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉపాధి పథకాలు చేపడతారు. పందాలు, బెట్టింగ్ లకు పాల్పడవద్దు.
ఆదాయం నిరాశాజనకం. పురోగతి లేక నిస్తేజానికి లోనవుతారు. చిన్నపాటి ఒత్తిళ్లున్నా ఉత్సాహం తగ్గకుండా చూసుకోండి. రావలసిన ధనం ఆలస్యంగా అందుతుంది. అవసరాలు వాయిదా వేసుకుంటారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. అయన వారు మీ అశక్తతను అర్ధం చేసుకుంటారు. పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. సోమవారం నాడు వ్యవహర ఒప్పందాల్లో అప్రమత్తంగా ఉండాలి. హామీలు, సంతకాల విషయంలో తొందరపడవద్దు. పెద్దల సలహా తీసుకోండి. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఆటుపోట్లను నిబ్బరంగా ఎదుర్కుంటారు. ఉద్యోగస్తులకు పనిభారం. పూర్వ విద్యార్థులను కలుసుకుంటారు. గత సంఘటనలు అనుభూతినిస్తాయి.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
అభీష్టం నెరవేరుతుంది. బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తారు. ముఖ్యమైన విషయాల్లో లౌక్యంగా మెలగండి. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి. ఆదాయం సంతృప్తికరం. ఊహించిన ఖర్చులే ఉంటాయి. ఆప్తులకు సాయం అందిస్తారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. ఇంటి విషయాలు పట్టించుకుంటారు. శనివారం నాడు అనవర విషయాల్లో జోక్యం తగదు. కొత్త యత్నాలు మొదలెడతారు. కలిసివచ్చిన అవకాశాన్ని తక్షణం అందిపుచ్చుకోండి. అనుమానాలు, అపోహలకు తావివ్వవద్దు. సన్నిహితుల సలహా తీసుకోండి. నూతన వ్యాపారాలకు అనుకూలం. ఉద్యోగ బాధ్యతలపై శ్రద్ధ పెట్టండి. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. ఉపాధ్యాయులకు స్థానచలనం. ప్రయాణం కలిసివస్తుంది.
సింహం మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
లాభదాయక ఫలితాలున్నాయి. పట్టుదలతో శ్రమించి కార్యం సాధిస్తారు. మానసిక ప్రశాంతత, కుటుంబసౌఖ్యం ఉన్నాయి, మంగళవారం నాడు పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోండి. మీ చొరవతో శుభకార్యం నిశ్చయమవుతుంది. ఆదాయం సంతృప్తికరం. వాహనం, గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. సంతానం భవిష్యత్తుపై దృష్టిపెడతారు. ఒక ఆహ్వానం సంతోషం కలిగిస్తుంది. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. వైద్య, న్యాయ, సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నూతన పెట్టుబడులకు తరుణం కాదు. హోల్సేల్ వ్యాపారులు, స్టాకిస్టులు అప్రమత్తంగా ఉండాలి. సరుకు నిల్వలో జాగ్రత్త. పందాలు, బెట్టింగ్లకు పాల్పడవద్దు.
శుభకార్యాన్ని ఘనంగా చేస్తారు. మీ ఆతిధ్యం ఆకట్టుకుంటుంది. పరస్పరం కానుకలిచ్చిపుచ్చుకుంటారు. ఆదాయం బాగుంటుంది. ఊహించిన ఖర్చులే ఉంటాయి. మీదైన రంగంలో ఒత్తిడికి గురికావద్దు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆదివారం నాడు కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. కార్యక్రమాలు ముందుకు సాగవు. దంపతుల మధ్య సఖ్యత లోపం. మీ శ్రీమతిని కష్టపెట్టవద్దు. ఇంటి విషయాలపై శ్రద్ధ వహించండి. మీ సాయంతో ఒకరికి మంచి జరుగుతుంది. వ్యవహార ఒప్పందాల్లో మెలకువ వహించండి. అనాలోచిత నిర్ణయాలు తగవు. అనుభవజ్ఞులను సంప్రదించండి. ఉపాధి పథకం చేపడతారు. ఉద్యోగస్తులకు బాధ్యతల మార్పు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ప్రైవేట్ ఉద్యోగస్తులకు మార్పులు అనుకూలిస్తాయి. వాహనదారులకు దూకుడు తగదు.
మీ బాధ్యతలను సక్రమంగా నిర్వహించండి. ఇతరులపై నెపం వేయవద్దు. ధైర్యంగా యత్నాలు సాగించండి. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. ధనసహాయం తగదు. మీ ఇష్టాయిష్టాలను సామరస్యంగా తెలియజేయండి. మాటతీరు అదుపులో ఉంచుకోవటం శ్రేయస్కరం. సంతానానికి శుభఫలితాలున్నాయి. బంధుమిత్రులతో తరుచు సంభాషిస్తారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. అసాధ్యమనుకున్న పనులు తేలికగా పూర్తి చేస్తారు. సోమ, మంగళ వారాల్లో ఆచితూచి అడుగేయండి. ఒంటెద్దు పోకడ తగదు. మీ శ్రీమతి సలహా తీసుకోండి. కీలక పత్రాలు అందుకుంటారు. నిరుద్యోగులు ఇంటర్వ్యూలో విజయం సాధిస్తారు. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. చిరువ్యాపారులకు సామాన్యం. ఉద్యోగసులకు బాధ్యతల మార్పు. ఉపాధ్యాయులకు కోరుకున్న చోటికి స్థానచలనం.
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
ఈ వారం ప్రతికూలతలు అధికం. కార్యసాధనకు మరింత శ్రమించాలి. ఆశావహదృక్పధంతో మెలగండి. అపజయాలకు కుంగిపోవద్దు. ఆదాయం ఫర్వాలేదనిపిస్తుంది. అనవసర ఖర్చులు తగ్గించుకుంటారు. పనుల్లో ఒత్తిడి, జాప్యం అధికం. సన్నిహితులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. ఆందోళన తగ్గి కుదుటపడతారు. యత్నాలకు కుటుంబీకుల ప్రోత్సహం ఉంటుంది. కనిపించకుండా పోయిన వస్తువులు, పత్రాలు లభ్యమవుతాయి. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. అయిన వారితో ఉల్లాసంగా గడుపుతారు. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. భాగస్వామిక ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాలతో తీరిక ఉండదు. అధికారులకు హోదామార్పు, స్థానచలనం. పూర్వ విద్యార్థుల సమావేశంలో పాల్గొంటారు.
ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకుంటారు. ఆప్రయత్నంగా అవకాశాలు కలిసివస్తాయి. లౌక్యంగా పనులు చక్కబెట్టుకుంటారు, ఆదాయం బాగుంటుంది. ఖర్చులు భారమనిపించవు. విలాసాలకు ఖర్చు చేస్తారు. తెగిపోయిన బంధుత్వాలు బలపడతాయి. బుధవారం నాడు అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. మీ వ్యక్తిత్వానికి భంగం కలుగకుండా మెలగండి. నోటీసులు అందుకుంటారు. అయిన వారి మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. ఎదుటివారి అభిప్రాయాలకు విలువ ఇవ్వండి. ఒంటెద్దు పోకడ తగదు. ఆరోగ్యం మందగిస్తుంది. సొంత పరిజ్ఞానంతో మందులు వేసుకోవద్దు. ఉద్యోగ బాధ్యతలపై దృష్టిపెట్టండి. ప్రలోభాలకు లొంగవద్దు. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. వ్యాపారాలు క్రమంగా ఊపందుకుంటాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు.
కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. మీ కృషి ఫలిస్తుంది. వస్త్రప్రాప్తి, వస్తులాభం ఉన్నాయి. సమర్ధతను చాటుకుంటారు. వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి. నిలిపివేసిన పనులు పునఃప్రారంభిస్తారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. సభ్యత్వాలు స్వీకరిస్తారు. వ్యాపకాలు, బాధ్యతలు అధికమవుతాయి. ఆదాయానికి తగ్గట్టుగా ప్రణాళికలు వేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. పెట్టుబడుల విషయం పునరాలోచించండి. శుక్రవారం నాడు అప్రమత్తంగా ఉండాలి. నగదు చెల్లింపుల్లో జాగ్రత్త. ఎవరినీ అతిగా నమ్మవద్దు. సంతానం విద్యాయత్నం ఫలిస్తుంది. ఆత్మీయులతో తరచు సంభాషిస్తుంటారు. ఉపాధ్యాయులకు స్థానచలనం. ఉద్యోగస్తులకు బాధ్యతల మార్పు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. వృత్తుల వారి ఆదాయం బాగుంటుంది. ముఖ్య సమావేశంలో పాల్గొంటారు.
పరిస్థితులు అనుకూలిస్తాయి. ఏ కార్యం తలపెట్టినా విజయవంతమవుతుంది. కీలక విషయాలపై పట్టు సాధిస్తారు. ఆదాయం బాగుంటుంది. వాహనం, విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి. పనులు సావకాశంగా పూర్తి చేస్తారు. శనివారం నాడు ఊహించని సంఘటన ఎదురవుతుంది. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. శుభకార్యం తలపెడతారు. బంధుత్వాలు, పరిచయాలు బలపడతాయి. సంతానం దూకుడు అదుపు చేయండి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. మీ పథకాలు ఆశించిన ఫలితాలిస్తాయి. నిరుద్యోగులు ఇంటర్వ్యూల్లో రాణిస్తారు. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. ప్రైవేట్ ఉద్యోగస్తులకు నిరాశాజనకం. రిటైర్డు అధికారులకు వీడ్కోలు పలుకుతారు.
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
వాక్చాతుర్యంతో రాణిస్తారు. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. సమస్యలను నిబ్బరంగా ఎదుర్కుంటారు. మీ కార్యదీక్ష ప్రశంనీయమవుతుంది. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. దుబారా ఖర్చులు విపరీతం. నగదు చెల్లింపుల్లో జాగ్రత్త. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. కొత్తవ్యక్తులు మోసగించే ఆస్కారం ఉంది. సోదరీ సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. ఆది, సోమ వారాల్లో అనవసర జోక్యం తగదు. వివాదాస్పద విషయాల్లో మీ ప్రమేయం లేకుండా చూసుకోండి. చేపట్టిన పనులు మొండిగా పూర్తిచేస్తారు. వృత్తి ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు ధనప్రలోభం తగదు. వ్యాపారాభివృద్ధికి మరింతగా శ్రమించాలి. నూతన వ్యాపారాల ఆలోచన ప్రస్తుతానికి వాయిదా వేయండి.