తులసీ మొక్క వాడిపోతే.. కీడు జరుగుతుందని గుర్తించాలట?

శనివారం, 1 జులై 2017 (10:00 IST)
ఇంటి ముందు వుండే తులసీ కోటలోని తులసీ మొక్క వాడిపోతే కీడు జరుగుతుందని గుర్తించాలట. తుల‌సి చెట్టు ఇంట్లో వుండటం ఆధ్యాత్మిక పరంగానూ, ఆరోగ్యపరంగానూ మేలు చేస్తుంది. అయితే ఈ తులసి మొక్క సహజ రంగును కోల్పోవడమో.. లేకుంటే ఆకులు రాలి ఎండిపోవడమో జరుగుతుంది. అలా జరిగితే కీడు జరుగుతుందని గ్రహించాలని జ్యోతిష్య పండితులు చెపుతున్నారు. తుల‌సి చెట్టు ఎప్పుడూ ప‌చ్చ‌గా ఉంటే.. ఇంట్లో ఆనందం, సంతోషం మనవెంటే ఉంటాయట. ఇంట్లో వారికి ఎలాంటి స‌మ‌స్య‌లు రావ‌ట.
 
ఒక వేళ నీళ్లు పోయ‌కున్నా తులసి మొక్క బాగా ప‌చ్చ‌గా, ఏపుగా పెరిగితే ఇంట్లో వారికి అదృష్టం క‌ల‌సి రాబోతుంద‌ని అర్థం చేసుకోవాలి. కానీ చెట్టు ఆకులు అకస్మాత్తుగా వేరే రంగుకు మారితే.. ఇంట్లో ఉన్న‌వారు క్షుద్రశ‌క్తుల బారిన పడనున్నారని అర్థమట. ఒకవేళ పచ్చగా కళకళలాడుతున్న తుల‌సి చెట్టు ఆకులు అకస్మాత్తుగా ఎండిపోతే.. ఆ ఇంటి య‌జ‌మానికి ఆరోగ్యం ప‌రంగా కీడు జ‌ర‌గ‌బోతుంద‌ని అర్థం చేసుకోవాలని జ్యోతిష్య నిపుణులు చెపుతున్నారు.

వెబ్దునియా పై చదవండి